International Media | మోదీకి ఇక తిరుగులేదు.. టీవీకే దెబ్బకు డీఎంకే విలవిల.. ఎన్నికల ఫలితాలపై పాశ్చాత్య మీడియా
International Media | మన దేశంలో నిన్న వెలువడిన నాలుగు రాష్ట్రాలు, యూటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విదేశీ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. అమెరికా, బ్రిటిష్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మీడియా ప్రత్యేకంగా కథనాలను ప్రచురించాయి. ముఖ్యంగా విపక్షాలకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ హస్తగతం చేసుకోవడంపై ప్రశంసలు కురిపించాయి. ఈ విజయం ప్రధాని మోదీ ఇమేజ్‌ను మరింత పెంచాయని అభిప్రాయపడ్డాయి. అదే సమయంలో పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే బలమైన పార్టీలను టీవీకే మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
International Media | నిన్న వెలువడిన నాలుగు రాష్ట్రాలు, యూటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దేశం మొత్తం ఆసక్తికరంగా తిలకించింది. తూర్పు భారతావనిలో బీజేపీ విజయ దుంధుబి (BJPs Victory In Bengal), దక్షిణ భారతదేశంలో టీవీకే చీఫ్ విజయ్ విజయాన్ని దేశం మొత్తం ఆస్వాదించింది. ఈ ఫలితాలపై భారత మీడియానే కాదు.. విదేశీ మీడియా (International Media) కూడా ప్రముఖంగా ఫోకస్ పెట్టింది.
అమెరికా నుంచి లండన్ వరకూ.. పాకిస్థాన్ నుంచి ఢాకా వరకూ ప్రతీ పాశ్చాత్య పత్రిక భారత్‌లో జరిగిన ఎన్నికల పరిణామాలపై తమ ఫ్రంట్ పేజీల్లో కథనాలను ప్రచురించాయి. విదేశీ మీడియా ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో సాధించిన విజయంపైనే ప్రత్యేకంగా దృష్టిసారించింది. తమిళ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ విజయంపై కూడా కథనాలు ప్రచురించాయి. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
బెంగాల్ బీజేపీ హస్తగతం.. బ్రిటిష్ పత్రికలు ఆశ్చర్యం..
విపక్షాలకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ హస్తగతం చేసుకోవడంపై బ్రిటిష్ పత్రికలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. "బీజేపీ బెంగాల్‌ను జయించింది.. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటిగా ఈ విజయం నిలుస్తుంది" అని బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ పేర్కొంది.
మరో బ్రిటిష్ దినపత్రిక "ది గార్డియన్" కూడా బెంగాల్ ఫలితాలపై స్టోరీ ప్రచురించింది. "నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ బెంగాల్ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించింది" అనే శీర్షికతో కథనం ప్రచురించింది.
బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషించింది.
మోదీ ఇమేజ్ మరింత పైకి.. అమెరికా మీడియా
అమెరికా మీడియా కూడా బెంగాల్‌లో బీజేపీ గెలుపును చరిత్మాత్మక విజయంగా అభివర్ణించాయి. 'మోదీ నేతృత్వంలోని హిందూ జాతీయవాదులు భారత ప్రతిపక్షాల కంచుకోటను బద్దలు కొట్టాయి' అనే శీర్షికతో 'న్యూయార్క్ టైమ్స్' తమ ఫ్రంట్ పేజీలో కథనం ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పునర్నిర్మించే క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ఓ కొత్త మైలురాయిని చేరుకుందని కొనియాడింది.
అదేసమయంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సాధించిన అనూహ్య విజయం గురించి కూడా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ప్రస్తావించింది. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి విజయం సాధించడం గొప్ప విషయం అని కొనియాడింది. డీఎంకే, ఏఐఏడీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
మోదీకి తిరుగులేదు..
బెంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ ప్రతిష్టను మరింత పెంచుతాయని 'వాషింగ్టన్ పోస్ట్' అభిప్రాయపడింది. మూడో విడత పాలనలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ విజయాలు సహాయపడతాయని విశ్లేషించింది. "2024 జాతీయ ఎన్నికల్లో అధికార పార్టీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే, 2029లో ఆయన నాలుగోసారి రికార్డు స్థాయిలో గెలుపొందే అవకాశం ఉంది" అని తన కథనంలో పేర్కొంది. అదే సమయంలో కేరళం ఫలితాలను కూడా వాషింగ్టన్ పోస్ట్ ప్రస్తావించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం.. అధికార కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించిందని పేర్కొంది. వామపక్షాల చివరి కోటల్లో ఒకటైన కేరళంలో వారి పాలన ఇక ముగిసిందని అభిప్రాయపడింది.
డాన్ ఏమన్నదంటే..?
భారత ఎన్నికల ఫలితాలను మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్ మీడియా కూడా కవర్ చేశాయి. చాలా కాలంగా ప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను మోదీకి చెందిన జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పాక్‌కు చెందిన డాన్ పత్రిక పేర్కొంది. ఈ గెలుపు 2029 సాధారణ ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తాయని అభిప్రాయపడింది.
స్టాలిన్ ఓటమిపై ఢాకా ట్రిబ్యూన్ ఆశ్చర్యం..
తమిళనాడు ఎన్నికల ఫలితాలపై బంగ్లాదేశ్‌కు చెందిన 'ఢాకా ట్రిబ్యూన్' కథనాన్ని ప్రచురించింది. అక్కడ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత ఎంకే స్టాలిన్ ఓ సామాన్య ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. నటుడు జోసెఫ్ విజయ్ స్థాపించిన టీవీకే దెబ్బకు ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) చితికిలపడిందని వివరించింది.
Also Read..
పనిమనిషి నుంచి ఎమ్మెల్యే స్థాయికి.. బెంగాల్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మహిళ గెలుపు
ఇన్‌స్టాలో ఇక ఏఐ కంటెంట్‌ను గుర్తించడం ఈజీ.. అసలైన క్రియేటర్లకు గుర్తింపు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






