From house help to MLA | పనిమనిషి నుంచి ఎమ్మెల్యే స్థాయికి.. బెంగాల్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మహిళ గెలుపు
From house help to MLA | కాలితా మాఝీ అనే మహిళ గతంలో నాలుగు ఇళ్లలో పనిచేసుకుంటూ చాలీచాలని జీతంతో ఇంటిని నెట్టుకొచ్చేది. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌తో బరిలోకి దిగిన ఆమె టీఎంసీ అభ్యర్థి శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. సాధారణ పౌరులు సైతం ఎన్నికల్లో విజయం సాధించొచ్చని నిరూపిస్తోంది.
From house help to MLA | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ( West Bengal Assembly elections) భారతీయ జనతా పార్టీ (BJP) చరిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీదీ కంచుకోటను బద్దలు కొట్టి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు కాషాయ పార్టీ ఘనంగా ముగింపు పలికింది. ఆ రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఓ సంచలనమనే చెప్పాలి. అదే సమయంలో ఎన్నికల ఫలితాల్లో ఓ మహిళ విజయం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. గతంలో పలు ఇళ్లలో పని మనిషిగా చేసిన (house help) మహిళ.. బీజేపీ టికెట్‌తో ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఆసక్తికరంగా మారింది.
గుస్కారా (Guskara) మున్సిపాలిటీకి చెందిన కాలితా మాఝీ (Kalita Majhi) గతంలో పలు ఇళ్లలో పనిమినిషిగా (domestic worker) చేస్తూ జీవనం సాగించేది. ఆ సమయంలో ఆమె నెలకు రూ.2,500 వరకూ సంపాదించేది. చుట్టుపక్కల ప్రజలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. దీంతో 2021 ఎన్నికల్లో మాఝీకి బీజేపీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపింది. అయితే, ఆ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి అభేదానంద థందర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ స్థానికులతో ఆమెకు ఉన్న అనుబంధం, పట్టుపై నమ్మకంతో తాజా ఎన్నికల్లో ఆమెకు కమలం పార్టీ మరోసారి అవకాశం కల్పించింది.
ఔస్ గ్రామ్ (Ausgram seat) నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మాఝీ భారీ మెజారిటీ సాధించింది. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. టీఎంసీ అభ్యర్థి శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఫలితాల్లో మాఝీకి మొత్తం 1,07,692 ఓట్లు పోలయ్యాయి. ఎలాంటి ఆస్తులు, అంతస్తులు లేకపోయినా.. ఇళ్లలో పనిచేసుకుంటూ జీవిస్తున్న ఓ సాధారణ పౌరురాలు ఇంతటి భారీ మెజారిటీతో గెలుపొందడం ఆ రాష్ట్ర రాజకీయాల్లోనేకాదు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి. ఆమె విజయం సాధారణ పౌరులు సైతం ఎన్నికల్లో విజయం సాధించొచ్చని నిరూపించింది.
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుంధుబి మోగించింది. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 206 స్థానాల్లో జయభేరి మోగించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మెజారిటీతో బీజేపీ రెండు వంతుల మార్కును దాటడమే కాకుండా.. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు స్వస్తి పలికింది. ఈ భారీ విజయం పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో ఒక నిర్మాణాత్మక మార్పును సూచిస్తోంది.
Also Read..
గోల్డ్ శారీ, డైమండ్స్ బ్లౌజ్.. మెట్‌గాలాలో ఈషా అంబానీ మెరుపులు
రెండు మంత్రి పదవులు ఇస్తేనే మద్దతు.. విజయ్‌కి కాంగ్రెస్ షరతు!
బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఆరు ఫర్నీచర్ షాపులు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



