త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Content | ఇన్‌స్టాలో ఇక ఏఐ కంటెంట్‌ను గుర్తించ‌డం ఈజీ.. అస‌లైన క్రియేట‌ర్ల‌కు గుర్తింపు..

AI Content | సోష‌ల్ మీడియా, ఏఐ వినియోగం పెరిగిన నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న చాలా పోస్టుల్లో నిజ‌మైన ఫొటోలు, వీడియోల‌ను గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. అస‌లు క‌న్నా ఫేక్ వీడియోల‌నే యూజ‌ర్లు ఎక్కువ‌గా విశ్వ‌సిస్తున్నారు. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు కూడా ఫేక్ కంటెంట్‌ను గుర్తించ‌లేక చాలా సార్లు పొర‌పాట్లు చేస్తున్నాయి.

S

Technology | Published On May 5, 2026, 10.45 am IST

AI Content | ఇన్‌స్టాలో ఇక ఏఐ కంటెంట్‌ను గుర్తించ‌డం ఈజీ.. అస‌లైన క్రియేట‌ర్ల‌కు గుర్తింపు..
Advertisement

AI Content | సోష‌ల్ మీడియా, ఏఐ వినియోగం పెరిగిన నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న చాలా పోస్టుల్లో నిజ‌మైన ఫొటోలు, వీడియోల‌ను గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. అస‌లు క‌న్నా ఫేక్ వీడియోల‌నే యూజ‌ర్లు ఎక్కువ‌గా విశ్వ‌సిస్తున్నారు. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు కూడా ఫేక్ కంటెంట్‌ను గుర్తించ‌లేక చాలా సార్లు పొర‌పాట్లు చేస్తున్నాయి. అయితే ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు మెటా సంస్థ‌కు చెందిన ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త మార్పులు చేస్తోంది. యూజ‌ర్లు అందులో పోస్ట్ చేసే కంటెంట్ ను ఏఐ ద్వారా క్రియేట్ చేశారా, నిజమైన కంటెంటేనా అని గుర్తించ‌డం కోసం కొత్త‌గా ఏఐ క్రియేట‌ర్ లేబుల్స్‌ అనే ఫీచ‌ర్‌ను టెస్ట్ చేస్తోంది. దీని వ‌ల్ల క్రియేటర్లు ఏఐ స‌హాయంతో క్రియేట్ చేసే ఫొటోలు లేదా వీడియోల‌కు ఏఐ జ‌న‌రేటెడ్ అనే లేబుల్ ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇక క్రియేట‌ర్లు అదే ప‌నిగా ఏఐ ద్వారానే అధిక మొత్తంలో కంటెంట్‌ను క్రియేట్ చేస్తే ఏకంగా వారి అకౌంట్‌కే ఏఐ క్రియేట‌ర్ అనే లేబుల్‌ను ఇస్తారు. దీని వ‌ల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న అస‌లైన యూజ‌ర్లకు ఏఐ జ‌న‌రేటెడ్ కంటెంట్‌ను గుర్తించ‌డం చాలా తేలిక‌వుతుంది. అలాగే న‌కిలీ అకౌంట్ల‌కు కూడా ఫుల్ స్టాప్ పెట్ట‌వ‌చ్చు.

ఏఐ క్రియేట‌ర్ లేబుల్‌..

ఇన్‌స్టాగ్రామ్ త‌న ప్లాట్‌ఫామ్‌లో త‌ర‌చూ ఏఐ ఆధారిత కంటెంట్‌ను ఉప‌యోగించే అకౌంట్ల‌కు ఇక కొత్త‌గా ఏఐ క్రియేట‌ర్ అనే లేబుల్‌ను ఇస్తుంది. ఈ లేబుల్ ఉందంటే ఆ యూజ‌ర్ క్రియేట్ చేసే కంటెంట్ మొత్తం ఏఐ ద్వారా జ‌న‌రేట్ చేశార‌ని ఇత‌ర యూజ‌ర్ల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అలాగే ఏఐ స‌హాయంతో జ‌న‌రేట్ చేసిన కంటెంట్‌కు కూడా ఏఐ జ‌న‌రేటెడ్ అనే లేబుల్ ఇస్తారు. దీంతో ఏ పోస్టు నిజ‌మైన కంటెంట్‌ను క‌లిగి ఉంది, ఎందులో ఏఐని వాడారు అన్ని విష‌యాలు సుల‌భంగా తెలుస్తాయి. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఏఐ జ‌న‌రేటెడ్ కంటెంట్ వ్యాప్తి అధికంగా ఉండ‌డంతోనే ఇన్‌స్టాగ్రామ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. యూజ‌ర్ల‌కు కంటెంట్ విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త‌ను అందించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలియ‌జేసింది.

ఏఐ ఇన్ఫోకు బ‌దులుగా..

కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్ప‌టికే ఏఐ ఇన్ఫో అనే లేబుల్‌ను ఇస్తుండ‌గా, దీన్ని మ‌రింతగా అభివృద్ధి చేసి ఏఐ క్రియేట‌ర్ లేబుల్స్‌గా మార్చి ఇవ్వ‌నున్నారు. యూజ‌ర్లు ఏఐ కంటెంట్‌ను పోస్ట్ చేసిన‌ప్పుడు ఈ లేబుల్‌ను మాన్యువ‌ల్‌గా జోడించ‌వ‌చ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే ఏఐ ఆటోమేటిగ్గా ఏఐ కంటెంట్‌ను గుర్తించి దానికి ఆ లేబుల్‌ను ఇస్తుంది. అలాగే కంటెంట్‌ను ఏ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను వాడి జ‌న‌రేట్ చేశారో కూడా లేబుల్‌లో తెలియ‌జేస్తుంది. ఇక ఈ లేబుల్‌ను ఎనేబుల్ చేశాక ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ‌ర్‌కు చెందిన ప్రొఫైల్ బ‌యోలో, ఫీడ్ పోస్టులు, రీల్స్ లో యూజ‌ర్ నేమ్ కింద‌, ఫీడ్, రీల్స్‌, ఎక్స్ ప్లోర్ విభాగాల్లో ఇలా అన్ని చోట్లా ఈ లేబుల్ క‌నిపిస్తుంది. ప్రొఫైల్ బ‌యోలో ఏఐ క్రియేట‌ర్ లేబుల్ ద‌ర్శ‌న‌మిస్తే ఆ యూజ‌ర్ పూర్తిగా ఏఐ అని అర్థం చేసుకోవాలి. అదే పోస్టుల్లో ఫొటోలు లేదా వీడియోల‌కు క‌నిపిస్తే వాటిని ఏఐ ద్వారా క్రియేట్ చేశార‌ని భావించాలి. ఇలా ఏఐ కంటెంట్‌ను ఇన్‌స్టాలో ఇక సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు.

టెస్టింగ్ ద‌శ‌లో..

ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం క్రియేట‌ర్లు మాన్యువ‌ల్‌గా కూడా ఆన్ చేయ‌వ‌చ్చు. త్వ‌ర‌లోనే ఆటోమేటిగ్గా దీన్ని అంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌నున్నారు. అయితే కేవ‌లం కొంత‌మందికి మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తోంది. టెస్టింగ్ ద‌శ‌లో ఉన్నందున అంద‌రికీ అందుబాటులో లేదు. ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిందో, లేదో చెక్ చేయాలంటే యూజ‌ర్లు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో ప్రొఫైల్‌లోకి వెళ్లాలి. త‌రువాత ఎడిట్ ప్రొఫైల్‌పై ట్యాప్ చేసి ఏఐ క్రియేట‌ర్ టాగుల్‌ను ఆన్ చేయాలి. ఒక‌సారి ఎనేబుల్ చేసిన త‌రువాత ఈ లేబుల్ ప్రొఫైల్‌తోపాటు కంటెంట్‌లో కూడా ఆటోమేటిక్‌గా క‌నిపిస్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ తెలిపిన ప్ర‌కారం ఈ లేబుల్ ఫీచ‌ర్ వ‌ల్ల యూజ‌ర్లు క్రియేట్ చేసే కంటెంట్‌కు ర్యాంకింగ్‌, రీచ్ లేదా డిస్ట్రిబ్యూష‌న్ త‌గ్గ‌డం, రికమెండేష‌న్స్ రాక‌పోవ‌డం వంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌దు. వాటిపై ఈ కొత్త ఫీచ‌ర్ ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌ని సంస్థ తెలిపింది. ఇది కేవ‌లం యూజ‌ర్ల‌కు ఏఐ కంటెంట్‌ను గుర్తించ‌డం కోస‌మే అందుబాటులోకి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement