త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | బెస్ట్ బ‌ర్త్‌డే గిఫ్ట్ అంటూ త్రిష‌కు హీరోయిన్ల విషెస్‌…ఇల్లీగల్ ఎఫైర్స్‌కు సపోర్టా? … నెటిజన్ల ఫైర్!

త్రిష‌కు బ‌ర్త్‌డే విషెస్ చెబుతూ కొంద‌రు సెలిబ్రిటీలు చేసిన ట్వీట్స్ కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. విజ‌య్ గెలుపుతో త్రిష‌కు బెస్ట్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ద‌క్కిందంటూ వీరు చేసిన ట్వీట్స్‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. వివాహేత‌ర సంబంధాల్ని ఎలా ప్రోత్సాహిస్తారంటూ ట్రోల్ చేస్తున్నారు.

N

Entertainment | Published On May 5, 2026, 11.32 am IST

Trisha | బెస్ట్ బ‌ర్త్‌డే గిఫ్ట్ అంటూ త్రిష‌కు హీరోయిన్ల విషెస్‌…ఇల్లీగల్ ఎఫైర్స్‌కు సపోర్టా? … నెటిజన్ల ఫైర్!
Advertisement

Trisha |  సోమ‌వారం చెన్నై క్వీన్‌ త్రిష త‌న 43వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంది. త్రిష బ‌ర్త్‌డే నాడే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. విజ‌య్ గెలుపులో ప‌రోక్షంగా త్రిష పాత్ర కూడా ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష ప్రేమ‌లో ఉన్నార‌ని, వారిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీవీకే పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతుందంటూ వార్త‌లు రాగానే...విజ‌య్ ఇంటికి వెళ్లిన త్రిష దాదాపు గంట పాటు అత‌డితో మంత‌న‌లు జ‌రిపింది. సోమ‌వారం రోజు విజ‌య్‌ని క‌లిసిన ఏకైక కోలీవుడ్ సెలిబ్రిటీ త్రిష మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి మ‌ధ్య బంధంపై అనేక రూమ‌ర్లు వినిపిస్తోన్న త‌రుణంలో విజ‌య్‌ని త్రిష క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

గ‌రం గ‌రం....

మ‌రోవైపు త్రిష బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చెన్నై క్వీన్‌కు విషెస్ చెబుతూ కొంద‌రు హీరోయిన్లు సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టులు దుమారాన్ని రేపుతున్నాయి. వివాహేత‌ర సంబంధాల‌కు ఎలా స‌పోర్ట్ చేస్తారంటూ నెటిజ‌న్లు గ‌రం గ‌రం అవుతున్నారు. "నీ పుట్టిన‌రోజు నాడు అద్భుత‌మైన విజ‌యం రూపంలో ఈ యూనివ‌ర్స్‌ నీకు గొప్ప గిఫ్ట్ ఇచ్చింది. ఇది నీకు డ‌బుల్ సెల‌బ్రేష‌న్స్ డే "అంటూ త్రిష‌కు మంచు ల‌క్ష్మి బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది.

ద‌ళ‌ప‌తి విజ‌య్ పేరు లేకుండా...

"ఇది నీ లైఫ్‌లోనే బెస్ట్ బ‌ర్త్‌డే" అంటూ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త్రిష‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పింది. "చరిత్ర పుటల్లో నిలిచిపోయే విజయంతో నీ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యూ ఆర్ ల‌క్కీ" అంటూ హీరోయిన్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ ఛార్మీ కౌర్...త్రిష‌కు విషెస్ చెప్పింది. త‌మ ట్వీట్స్‌లో ఎక్క‌డ వీరు ద‌ళ‌ప‌తి విజ‌య్ పేరును డైరెక్ట్‌గా ప్ర‌స్తావించ‌లేదు. ఇన్‌డైరెక్ట్‌గా విజ‌య్ గెలుపు త్రిష‌కు బెస్ట్ బ‌ర్త్‌డే గిఫ్ట్ అన్న‌ట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటు మ‌రికొంద‌రు సెలిబ్రిటీలు కూడా త్రిష‌కు ఇదే రీతిలో శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. విజ‌య్‌, త్రిష మ‌ధ్య రిలేష‌న్ ఉన్న‌ట్లుగా ఇన్‌డైరెక్ట్‌గా త‌మ ట్వీట్స్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు.

సిగ్గు లేదా...

ఈ ట్వీట్స్‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఇల్లీగ‌ల్ ఎఫైర్స్‌ను స‌పోర్ట్ చేయ‌డానికి సిగ్గు లేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఓ మ‌హిళతో పాటు ఆమె పిల్ల‌ల జీవితాన్ని నాశ‌నం చేసిన చేసిన వారిని ఎలా స‌మ‌ర్థిస్తున్నారు అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వివాహేత‌ర సంబంధం పెట్టుకోవ‌డం త‌ప్పులేద‌న్న‌ట్లుగా వీరి ట్వీట్లు ఉన్నాయంటూ ఓ నెటిజ‌న్ పేర్కొన్నారు. నెటిజ‌న్ల ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

 

Advertisement
Advertisement