Traffic Diversions | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్‌లో సాయంత్రం 4 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Diversions | ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మ్యూజిక్ కన్సర్ట్ (Music Concert) నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం జరుగనున్న ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో యువత, అభిమానులు తరలిరానున్నారు.
Traffic Diversions | త్రినేత్ర.న్యూస్: ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మ్యూజిక్ కన్సర్ట్ (Music Concert) నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం జరుగనున్న ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో యువత, అభిమానులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గచ్చిబౌలి, దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions) విధించారు.
ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలపై పరిమితులు ఉంటాయని చెప్పారు. గచ్చిబౌలి జంక్షన్, ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్, విప్రో సర్కిల్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాల దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
మళ్లింపులు ఇలా..
- గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ఐఐఐటీ జంక్షన్ వద్ద దారి మళ్లించి విప్రో జంక్షన్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, నల్లగండ్లకు పంపిస్తారు.
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపన్‌పల్లి తండా, గచ్చిబౌలి, క్యూసిటీ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను విప్రో జంక్షన్ వద్ద దారిమళ్లిస్తారు.
- లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, కొత్తగూడ, మెహిదీపట్నం వైపు వచ్చే వాహనాలను బస్‌డిపొ జంక్షన్ వద్ద దారి మళ్లించి మసీద్ బండ, శ్రీరామ్ నగర్, బొటానికల్ జంక్షన్‌వైపు పంపిస్తారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



