US-India | ట్రంప్-మోదీ భేటీ వేళ ఇండో పేరు తొలగించి.. భారత్‌కు షాకిచ్చిన అమెరికా
US-India | భారత్‌కు అమెరికా బిగ్ షాకిచ్చింది. అమెరికా తన కీలక సైనిక కమాండ్ అయిన "యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్" పేరును మార్చింది. ఆ పేరు నుంచి "ఇండో" పదాన్ని తొలగించి "యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్ (US Pacific Command)"గా అమెరికా రక్షణశాఖ ప్రకటించింది.
US-India | G-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఫ్రాన్స్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ భేటీ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్‌కు అమెరికా బిగ్ షాకిచ్చింది. అమెరికా తన కీలక సైనిక కమాండ్ అయిన "యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్" పేరును మార్చింది.
Department of War Restores U.S. Pacific Command Designation.
CAMP H.M. SMITH, Hawaii — The Department of War announced today that the U.S. Indo-Pacific Command (USINDOPACOM) will officially restore its name to the U.S. Pacific Command (USPACOM).
Originally established on… pic.twitter.com/ZL0EL3q6Ph
— U.S. Pacific Command (@INDOPACOM) June 16, 2026
ఆ పేరు నుంచి "ఇండో" పదాన్ని తొలగించి పాత పేరును పునరుద్ధరించింది. "యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్ (US Pacific Command)"గా అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. చారిత్రక వారసత్వాన్ని కాపాడటం, పసిఫిక్ ప్రాంతంలో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తిని పెంపొందించడం కోసం పాత పేరునే పునరుద్ధరించినట్లు వెల్లడించింది. పేరు మార్పుతో పాటు అమెరికా వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఓ మ్యాప్‌లో భారత్ చిత్రపటాన్ని మార్చి చూపించింది. యూఎస్ పసిఫిక్ కమాండ్ ఎక్కడ పనిచేస్తుందో తెలిపుతూ రక్షణ శాఖ షేర్ చేసిన ఆ మ్యాప్‌లో 'పాక్ ఆక్రమిత కశ్మీర్'ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం వివాదానికి కారణమైంది.
1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రుమ్యాన్ యూఎస్ పసిఫిక్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు (Pacific Command rename). అయితే, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్'గా మార్చారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు మళ్లీ పాతపేరునే కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. భారత్‌తో రక్షణ, భద్రతా రంగాల్లో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న అమెరికా.. ఇప్పుడు తన వ్యూహంలో మార్పులు చేస్తోందా? లేక ఇది కేవలం చారిత్రక గుర్తింపును పునరుద్ధరించే చర్య మాత్రమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also Read..
డిప్యూటీ సీఎంగా రాఘవ లారెన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో
సంబంధిత వార్తలు

PM Modi | వారి భద్రత మనందరి బాధ్యత.. నావికుల మృతిపై ట్రంప్ సమక్షంలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
జూన్ 17, 2026

G7 Hot Mic Moments | స్మోకింగ్ వదిలేసిన మెలోనీ, వాచ్ మర్చిపోయిన మాక్రాన్.. G7 సదస్సులో దేశాధినేతల సరదా సంభాషణ
జూన్ 17, 2026

Melodi | మా జంట సోషల్ మీడియాలో చాలా ఫేమస్: జార్జియా మెలోనీ
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి
- ●Asus | ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..
- ●Vijay Devarakonda | విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. టీజీ 20 లీగే కారణమా..?
- ●Sanchita Ugale | నవ్వుల వెనుక అంతులేని వేదన.. సంచిత కేసులో కీలక వివరాలు వెల్లడించిన స్నేహితురాలు
- ●WhatsApp Plus Price | వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఇక ఫ్రీ కాదు.. జుకర్‌బర్గ్ మాస్టర్ ప్లాన్ ఇదే!
- ●Tummala Nageshwar Rao | ఈ 7 వరి రకాలకే బోనస్.. తేల్చిచెప్పిన మంత్రి తుమ్మల

Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

Asus | ఆసుస్ క్రోమ్‌బుక్‌ల హంగామా.. భారత్‌లో మూడు కొత్త మోడళ్లు..

Vijay Devarakonda | విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. టీజీ 20 లీగే కారణమా..?

Sanchita Ugale | నవ్వుల వెనుక అంతులేని వేదన.. సంచిత కేసులో కీలక వివరాలు వెల్లడించిన స్నేహితురాలు



