Melodi | మా జంట సోషల్ మీడియాలో చాలా ఫేమస్: జార్జియా మెలోనీ
Melodi | త్రినేత్ర.న్యూస్: ఫ్రాన్స్‌లోని ఎవియన్ వేదికగా జరుగుతున్న జీ7 (G7) సదస్సులో ఆసక్తికరమ పరిణామం చోటుచేసుకుంది. జీ7 సదస్సుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల అధినేతలు హాజరయ్యారు.
International | Published On Jun 17, 2026, 7.08 am IST
Melodi | త్రినేత్ర.న్యూస్: ఫ్రాన్స్‌లోని ఎవియన్ వేదికగా జరుగుతున్న జీ7 (G7) సదస్సులో ఆసక్తికరమ పరిణామం చోటుచేసుకుంది. జీ7 సదస్సుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల అధినేతలు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ అన్న మాటలు అత్యంత చర్చనీయాంశం అయ్యాయి. ఫ్యామిలీ ఫొటో సందర్భంగా మెలోనితో మాట్లాడుతూ `మీరు ఇన్‌స్టాగ్రామ్ చూశారా?` అని మోదీ అడిగారు.. దీనికి ఆమె `మా జంట ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్` అని చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు.
ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోని మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. దీంతో వారిరువురి పేర్లను కలిసి మెలోడీ (Meloni + Modi = Melodi)అని నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుస్తూ ఉంటారు. 2023లో దుబాయ్‌లో జరిగిన COP28 సదస్సు సందర్భంగా మెలోని పోస్ట్ చేసిన ఒక సెల్ఫీ ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రెండ్‌గా మారింది. ప్రధాని మోదీతో కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టుచేసిన ఆమె.. దానికి `COP28లో మంచి స్నేహితులు #మెలోడీ (#Melodi) అని క్యాప్షన్ పెట్టారు. ఆ హ్యాష్‌ట్యాగ్ వెంటనే చాలా ప్రాచుర్యం పొందింది. దీంతో అది గత మూడేండ్లుగా ఆన్‌లైన్‌లో ఒక బ్రాండ్‌గా మారింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతలు ఎక్కడ కలిసినా వారి ఫొటోలు ఇంర్నెట్ సెన్సేషన్‌గా మారుతుంటాయి.
Meloni- Nice to see you again, we are the most famous on Instagram😂
The way she's looking and smiling 🫣...
she knows exactly what social media people want😝
Popularity matters😎🔥#Melodi pic.twitter.com/AklSlK0yy0
— 𝐕𝐒𝐩𝐞𝐚𝐤𝐬🎧 (@WeTheThinkers) June 16, 2026
ఇటీవల ఇటలీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. పార్లే ప్రొడక్ట్స్‌కు చెందినటువంటి మెలోడీ టాఫీని గిఫ్ట్‌గా మెలోనీకి ఇచ్చారు. దానిని ఆమె స్వయంగా ఆ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వెరీ వెరీ గుడ్ టాఫీ అని మెలోనీ చెప్పడం.. దానికి మోదీ మెలోడీ అని సమాధానం ఇవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వ్యాపించింది. మీమ్స్ ట్రెండ్ మొదలైంది. కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 175 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇంటర్నెట్‌ను ఊపేసింది. ప్రస్తుతం దీనికి కోటీ 30 లక్షలకుపైగా (13 మిలియన్లు) లైక్స్ వచ్చాయి.
Most awaited moment of G7 Summit#Melodi 🧡 pic.twitter.com/JRC2JLFVpc
— Sunanda Roy 👑 (@SaffronSunanda) June 14, 2024
3 గంటల వ్యవధిలోనే ఏకంగా 40 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఇప్పటి వరకు ఆ వీడియోను కోటి మందికి పైగా లైక్ చేశారు. ఇదే విషయాన్ని జీ7 సదస్సులో మెలోని వద్ద ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికి ప్రతిగా `మేము ఇప్పుడు ఇన్‌స్టాలో అత్యంత ప్రజాధర పొందిన జంట` అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది! అని కూడా మోదీతో ఆమె అన్నారు.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
సంబంధిత వార్తలు

Kishan Reddy | కిషన్ రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఆగవు.. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జూన్ 16, 2026

Allu Arjun | బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా – అల్లు అర్జున్ సాంగ్‌తో ప్రధాని మోదీ పోస్ట్
జూన్ 16, 2026

PM Modi | స్లోవేకియా అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Horoscope | జూన్ 17 రాశిఫలాలు.. ఈ రాశివారు పాత హాబీలను పునరుద్ధరించుకుంటారు!
- ●India UPI System | "రోడ్డు పక్కన చాయ్ కొట్టు దగ్గర కూడా అదేనా?".. భారత్ డిజిటల్ విప్లవానికి యూరప్ పర్యాటకురాలు ఫిదా
- ●Bengaluru Traffic Viral Post | 4 కిలోమీటర్లకు 35 నిమిషాలా?.. బెంగళూరు ట్రాఫిక్‌కు 'స్టాక్‌హోమ్ సిండ్రోమ్' అంటూ నెటిజన్ ఆగ్రహం!
- ●Hyderabad startup CEO | లగ్జరీ కార్పొరేట్ లైఫ్‌కు గుడ్‌బై.. ఒరాకిల్, అమెజాన్ ఉద్యోగాలను వదిలి హైదరాబాద్ స్టార్టప్ సీఈఓగా మారిన తెలుగు టెకీ
- ●Free Pizza Rejection | "ఆ చెత్త మీరే తినండి".. ఫ్రీగా పిజ్జా ఇస్తానన్న కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్!
- ●Karauli Goat Breed | రైతుల పాలిట కామధేనువు: తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే లాభాలు.. డిమాండ్‌లో ఉన్న రాజస్థాన్ మేక జాతి ఇదే!

Horoscope | జూన్ 17 రాశిఫలాలు.. ఈ రాశివారు పాత హాబీలను పునరుద్ధరించుకుంటారు!

India UPI System | "రోడ్డు పక్కన చాయ్ కొట్టు దగ్గర కూడా అదేనా?".. భారత్ డిజిటల్ విప్లవానికి యూరప్ పర్యాటకురాలు ఫిదా

Bengaluru Traffic Viral Post | 4 కిలోమీటర్లకు 35 నిమిషాలా?.. బెంగళూరు ట్రాఫిక్‌కు 'స్టాక్‌హోమ్ సిండ్రోమ్' అంటూ నెటిజన్ ఆగ్రహం!

Hyderabad startup CEO | లగ్జరీ కార్పొరేట్ లైఫ్‌కు గుడ్‌బై.. ఒరాకిల్, అమెజాన్ ఉద్యోగాలను వదిలి హైదరాబాద్ స్టార్టప్ సీఈఓగా మారిన తెలుగు టెకీ



