త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPSC Civil Services | సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంక్ ఎవ‌రికంటే..?

UPSC Civil Services | సివిల్స్ పరీక్ష తుది ఫలితాలు (Civil Services result) విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం విడుదల చేసింది.

D

National | Published On Mar 6, 2026, 3.18 pm IST

UPSC Civil Services | సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంక్ ఎవ‌రికంటే..?
Advertisement

UPSC Civil Services | సివిల్స్ పరీక్ష తుది ఫలితాలు (Civil Services result) విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం విడుదల చేసింది. అభ్య‌ర్థులు upsc.gov.in లేదా upsconline.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను తెలుసుకోవచ్చు. మొత్తం 958 మంది సివిల్ స‌ర్వీసుల‌కు క్వాలిఫై అయ్యారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో 317, ఈడ‌బ్ల్యూఎస్ 104, ఓబీసీ 306,ఎస్సీ 158, ఎస్టీ 73 మంది సివిల్స్ సాధించిన‌ట్లు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఈ ప‌రీక్ష‌ల్లో అనూజ్ అగ్ని హోత్రి (Anuj Agnihotri) ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంక్ సాధించారు. రాజేశ్వ‌రి సువే రెండో ర్యాంక్‌, ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంక్, రాఘవ్‌ ఝున్‌ఝున్‌ వాలా నాలుగో ర్యాంక్‌ సాధించారు. ఈ ప‌రీక్ష‌ల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అభ్య‌ర్థులు కూడా స‌త్తా చాటారు. సృజన (55వ ర్యాంక్‌), డీఎస్‌కే ప్రచేత్‌ (193వ ర్యాంక్‌), ఎస్. వర్షిత్‌రెడ్డి (259వ ర్యాంక్‌), ఎం.పవన్‌కుమార్‌రెడ్డి (297వ ర్యాంక్) సాధించారు.

కాగా, 2025లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి గ‌తేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వ‌హించారు. వాటిలో అర్హత పొందిన వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంట‌ర్వ్యూలు చేప‌ట్టి.. అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌తో పాటు గ్రూప్ ఎ, గ్రూప్ బిలో వివిధ సెంట్రల్ సర్వీస్‌‌లో వీరంతా చేరనున్నారు.

Also Read..

త్వ‌ర‌లో తెలంగాణ‌లో 'ఎస్ఐఆర్'.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఈసీ

దుబాయ్‌లో టెన్ష‌న్‌.. దాడులు జ‌ర‌గొచ్చంటూ నివాసితుల ఫోన్ల‌కు అల‌ర్ట్స్‌

వార్ ఎఫెక్ట్‌.. శంషాబాద్ విమానాశ్ర‌యంలో 24 విమానాలు ర‌ద్దు..

Advertisement
Advertisement