DGP | తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్?.. తుది దశకు ఎంపిక!
DGP | రాష్ట్ర తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ (CV Anand) నియామకం కానున్నట్లు తెలుస్తున్నది. ఈ పోస్టుకు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లలో ముగ్గురిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఖరారు చేసింది.
DGP | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ (CV Anand) నియామకం కానున్నట్లు తెలుస్తున్నది. ఈ పోస్టుకు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లలో ముగ్గురిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఖరారు చేసింది. జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా పేర్లున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలోని యూపీఎస్సీ భవన్‌లో దాదాపు గంటపాటు జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా అధికారుల సర్వీస్ రికార్డు, మెరిట్, ఇతర అంశాలపై చర్చించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం పంపిన నలుగురి జాబితా నుంచి ఒకరిని పక్కనపెట్టి, ముగ్గురితో కూడిన తుది జాబితాను ఎంపిక కమిటీ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. వారిలో నుంచి ప్రభుత్వం ఒకరిని పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సీవీ ఆనంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.
కాగా, రాష్ట్రానికి పూర్తి కాలపు డీజీపీ (హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్- HOPF) లేరు. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న శివధర్ రెడ్డి ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. అంతకుముందు డీజీపీలు అంజనీకుమార్, రవిగుప్తా, జితేందర్ కూడా ఇన్‌చార్జ్‌లుగానే పనిచేశారు. అయితే రాష్ట్ర తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్‌శర్మ మొదట తాత్కాలిక డీజీపీగా పనిచేసినా తర్వాత యూపీఎస్సీ ద్వారా 2015 నవంబర్ 13న పూర్తికాలపు డీజీపీగా నియమితులయ్యారు. 2017 నవంబర్ 12 వరకు కొనసాగారు. అనంతరం తాత్కాలిక డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీగా నియమితులై 2022 డిసెంబరు వరకు పనిచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నియమితులు కానున్న హెచ్‌వోపీఎఫ్ తెలంగాణకు మూడో పూర్తి కాలపు డీజీపీ కానున్నారు.
తీవ్రంగా పోటీ..
యూపీఎస్సీ ఫైనల్ జాబితాలో ఉన్న ముగ్గురు అధికారుల్లో సీవీ ఆనంద్ సీనియర్. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. రాష్ట్రంలో ఏఎస్పీ నుంచి డీజీపీ హోదావరకు పలు స్థానాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆతర్వాత సీనియర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఉన్నారు. ఐబీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. దీంతో సీనియారిటీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని సీవీ ఆనంద్‌నే పూర్తికాలపు డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మరోవైపు సౌమ్యమిశ్రా కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఏప్రిల్ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. ఆ తర్వాతే నూతన డీజీపీని నియమించే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






