Dubai | దుబాయ్‌లో టెన్షన్.. దాడులు జరగొచ్చంటూ నివాసితుల ఫోన్లకు అలర్ట్స్
Dubai | దుబాయ్ (Dubai)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నగరంపై క్షిపణి దాడులు (Missile Attacks) జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో యూఏఈ ప్రభుత్వం అప్రమత్తమైంది.
International | Published On Mar 6, 2026, 2.56 pm IST
Dubai | క్షిపణులు, బాంబుల దాడులతో పశ్చిమాసియా (Middle East) దద్దరిల్లుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య దాడులు ప్రతిదాడులతో గల్ఫ్ దేశాలు (Gulf countries) అల్లాడిపోతున్నాయి. తాజాగా దుబాయ్ (Dubai)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నగరంపై క్షిపణి దాడులు (Missile Attacks) జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో యూఏఈ ప్రభుత్వం అప్రమత్తమైంది.
స్థానిక ప్రజలు, పర్యాటకుల ఫోన్లకు కీలక అలర్ట్‌లు పంపారు. ఏక్షణానైనా క్షిపణులు దూసుకురావొచ్చని.. అప్రమత్తంగా ఉండాలంటూ అత్యవసర హెచ్చరిక సందేశాలు (Emergency Alerts) పంపారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అందులో హెచ్చరించారు. కిటికీలు, గ్లాస్ డోర్లకు దూరంగా ఉండాలని సూచించారు. అంతేకాదు, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రభుత్వ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందేశంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. "క్షిపణి దాడుల గురించి ఫోన్‌లకు వెంట వెంటనే నాలుగు హెచ్చరికలు వచ్చాయి. ఆ మెసేజ్‌తో మేము అవసరమైన వస్తువులను నిల్వ చేసుకున్నాం. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పాస్‌పోర్ట్‌లతో సహా అన్ని ముఖ్యమైన పత్రాలను ఓ బ్యాగ్‌లో సిద్ధంగా ఉంచుకున్నాం" అని స్థానికులు పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ నుంచి మిస్సైల్స్ ముప్పు పొంచి ఉందన్న నిఘా హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దుబాయ్ తన గగనతల రక్షణ వ్యవస్థలను (Air Defense Systems) సిద్ధం చేసింది. విమానాశ్రయాల వద్ద, ప్రముఖ పర్యాటక ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇలా నగరం మొత్తం హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read..
వార్ ఎఫెక్ట్.. శంషాబాద్ విమానాశ్రయంలో 24 విమానాలు రద్దు..
యుద్ధం ఎఫెక్ట్.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి..? పెరుగుతాయా..?
లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన నయనతార.. ధర తెలిస్తే షాకే..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Petrol Price Hike | బిగ్ అలర్ట్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్పటి నుంచంటే..?
ఏప్రిల్ 23, 2026

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



