CV Anand | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్..?
CV Anand | తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
CV Anand | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 1991వ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ పూర్తిస్థాయి డీజీపీగా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. యూపీఎస్సీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు వచ్చాయి. రాష్ట్రం నుంచి నలుగురి పేర్లు పంపగా వారిలో ముగ్గురిని యూపీఎస్సీ సిఫారసు చేసింది. సీవీ ఆనంద్ వైపే రేవంత్ సర్కార్ మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం.
కాగా, రాష్ట్రానికి పూర్తి కాలపు డీజీపీ (హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్- HOPF) లేరు. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న శివధర్ రెడ్డి ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. అంతకుముందు డీజీపీలు అంజనీకుమార్, రవిగుప్తా, జితేందర్ కూడా ఇన్‌చార్జ్‌లుగానే పనిచేశారు. అయితే రాష్ట్ర తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్‌శర్మ మొదట తాత్కాలిక డీజీపీగా పనిచేసినా తర్వాత యూపీఎస్సీ ద్వారా 2015 నవంబర్ 13న పూర్తికాలపు డీజీపీగా నియమితులయ్యారు. 2017 నవంబర్ 12 వరకు కొనసాగారు. అనంతరం తాత్కాలిక డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీగా నియమితులై 2022 డిసెంబరు వరకు పనిచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నియమితులు కానున్న హెచ్‌వోపీఎఫ్ తెలంగాణకు మూడో పూర్తి కాలపు డీజీపీ కానున్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



