UPSC CDS 2 | 451 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్ 2 నోటిఫికేషన్.. జూన్ 9 వరకు దరఖాస్తులు
UPSC CDS 2 | త్రినేత్ర.న్యూస్: త్రివిధ దళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (UPSC CDS 2) నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ (UPSC) విడుదల చేసింది. మొత్తం 451 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 9న ముగియనున్నాయి. పెండ్లి కానివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సీడీఎస్ పరీక్షను యూపీఎస్సీ ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తున్నది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 451
- ఇండియన్ మిలటరీ అకాడమీ (IMA)- డెహ్రాడూన్: 100
- ఇండియన్ నేవల్ అకాడమీ (INA)- ఎజిమల: 26
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA)- హైదరాబాద్: 32
- ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ- చెన్నై (మెన్): 275
- ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ- మద్రాస్ (ఉమెన్): 18 పోస్టులు
అర్హత
- సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- మిలిటరీ అకాడమీకి.. డిగ్రీ లేదా తత్సమానమైన కోర్సు
- నేవల్ అకాడమీ- 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ చేయాలి.
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ- 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్
ఫైనల్ ఇయర్ విద్యార్థులు అయితే.. 2027 జూలై 1 నాటికి సర్టిఫికెట్ సమర్పించాలి.
వయస్సు: మిలిటరీ, నేవల్ అకాడమీకి అభ్యర్థులు 19 నుంచి 24 ఏండ్లు, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి 20 నుంచి 24 ఏండ్లు, ఓటీఏ- ఎస్ఎస్‌సీకి అయితే 19 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం
- రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్.
- రాతపరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలెమెంటర్ మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 100
- చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ 300 మార్కులకు ఉంటుంది.
- ఓటీఏ పోస్టులకు రాతపరీక్ష ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ నుంచి 100 చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూకి 200 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతి నెల రూ.56,100 స్టయిఫండ్ అందిస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
దరఖాస్తు ఫీజు: రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
రాతపరీక్ష: సెప్టెంబర్ 13
ఫలితాలు: అక్టోబర్ నెలలో
ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్): 2027 ఫిబ్రవరి-మార్చి
ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ (ఓటీఏ): 2027 ఏప్రిల్-జూన్
కోర్సు ప్రారంభం: 2027 అక్టోబర్
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






