త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

bob World Lite | 4జి ఫీచ‌ర్ ఫోన్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌.. ఇక చెల్లింపులు ఎంతో సుల‌భం..

bob World Lite | ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా టెలికాం దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ జియోతో క‌లిసి ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారుల కోసం ప్ర‌త్యేకంగా అభివృద్ధి చేసిన bob World Lite అనే కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ యాప్‌ను జియో ఫోన్ ప్రైమా 4జిలో అందిస్తున్నారు.

S

Technology | Published On Apr 14, 2026, 10.37 am IST

bob World Lite | 4జి ఫీచ‌ర్ ఫోన్ల‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌.. ఇక చెల్లింపులు ఎంతో సుల‌భం..
Advertisement

bob World Lite | ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా టెలికాం దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ జియోతో క‌లిసి ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారుల కోసం ప్ర‌త్యేకంగా అభివృద్ధి చేసిన bob World Lite అనే కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ యాప్‌ను జియో ఫోన్ ప్రైమా 4జిలో అందిస్తున్నారు. 4జి ఫీచ‌ర్ ఫోన్ల‌లోనూ వినియోగ‌దారుల‌కు స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో ఈ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. భార‌త ప్ర‌భుత్వం, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న ఆర్థిక స‌మ‌గ్ర‌త‌ను పెంచ‌డం, డిజిట‌ల్ చెల్లింపుల విస్త‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయ‌డం వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఆయా సంస్థ‌లు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

4జి ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఉప‌యోగ‌క‌రం..

స్మార్ట్ ఫోన్ల‌లోనే మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ల‌భిస్తాయ‌న్న విష‌యం తెలిసిందే. లేదంటే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌ను కంప్యూట‌ర్‌లో వాడాలి. దీంతో 4జి ఫీచ‌ర్ ఫోన్ల‌ను వాడే వారికి బ్యాంకింగ్ స‌దుపాయాలు ల‌భించ‌డం లేదు. అయితే అలాంటి వినియోగ‌దారుల‌కు కూడా బ్యాంకింగ్ సేవ‌లు ల‌భించాల‌నే ఉద్దేశంతో ఈ యాప్‌ను లాంచ్ చేశారు. దీని వ‌ల్ల డిజిట‌ల్ చెల్లింపులు మ‌రింత పెరుగుతాయ‌ని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ల‌లో బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఇప్ప‌టికే bob World పేరిట యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల‌పై అందిస్తోంది. అయితే bob World Lite అనే యాప్‌ను ప్ర‌త్యేకంగా 4జి ఫీచ‌ర్ ఫోన్ల కోసం రూపొందించారు. ఇది చాలా త‌క్కువ సైజ్ ఉండి లైట్ వెయిట్‌గా ప‌నిచేస్తుంది. ఫీచ‌ర్ ఫోన్‌లో అయినా వేగంగా ఓపెన్ అవుతుంది. ప్ర‌స్తుతం దేశంలో సెమి అర్బ‌న్‌, గ్రామీణ ప్రాంతాల్లో 4జి ఫీచ‌ర్ ఫోన్ల‌ను కూడా చాలా మంది వాడుతున్నార‌ని, అలాంటి వారికి ఈ యాప్ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు తెలిపారు.

చాలా త‌క్కువ ఇంట‌ర్నెట్‌, వేగ‌వంత‌మైన యాప్‌..

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, రిల‌య‌న్స్ జియో ప్ర‌వేశ‌పెట్టిన bob World Lite యాప్ చాలా త‌క్కువ ఇంట‌ర్నెట్‌ను వినియోగించుకుంటుంది. అందువ‌ల్ల 4జి ఫీచ‌ర్‌లో ల‌భించే మొబైల్ డేటా దీనికి స‌రిపోతుంది. ఇక కీప్యాడ్ ఆధారిత నావిగేష‌న్ ఉంటుంది క‌నుక భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను కూడా ఇందులో అద‌నంగా క‌ల్పించారు. దీని వ‌ల్ల అధునాత‌న స్మార్ట్ ఫోన్ లేకున్నా, అధిక వేగం క‌లిగిన ఇంట‌ర్నెట్ ను వాడ‌క‌పోయినా వినియోగ‌దారులు రోజువారీ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను నిరాటంకంగా కొన‌సాగించ‌వ‌చ్చు. ఈ యాప్‌లో ప‌లు ముఖ్య‌మైన బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని స‌దుపాయాల‌ను అందిస్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఇందులో యూపీఐ ఆధారిత స్కాన్ అండ్ పే చెల్లింపులు, సెండ్ మ‌నీ లావాదేవీలు, బిల్ చెల్లింపులు, మొబైల్ రీచార్జి వంటి యుటిలిటీ సేవ‌లు, ఖాతా నిర్వ‌హ‌ణ‌కు ప్రాథ‌మిక స‌దుపాయాలు వంటివి అందులోబాటులో ఉన్నాయి.

ఇత‌ర బ్యాంకుల ఖాతాదారులు కూడా..

ఈ యాప్‌ను కేవ‌లం బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఖాతాదారులే కాకుండా ఇత‌ర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. యాప్‌లోనే స్వ‌యంగా న‌మోదు చేసుకుని (self-onboarding) ఆ ప్ర‌క్రియ అనంత‌రం ఖాతాదారులు సేవ‌ల‌ను వాడుకోవ‌చ్చు. ఇక బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, రిల‌య‌న్స్ జియో ఒప్పందం ప్ర‌కారం కొత్త‌గా కొనుగోలు చేసే జియోఫోన్ ప్రైమా 4జి ఫీచ‌ర్ ఫోన్ల‌లో ఈ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ చేయ‌బ‌డి ఉంటుంది. ఇప్ప‌టికే ఈ ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్న‌వారు జియో స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. ఈ సంద‌ర్భంగా బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఎండీ, సీఈవో డాక్ట‌ర్ దేవ‌ద‌త్త చంద్ మాట్లాడుతూ డిజిట‌ల్ స‌మ‌గ్ర‌త‌ను పెంచడం, ఫీచ‌ర్ ఫోన్ల ద్వారా కూడా సుర‌క్షిత‌మైన బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ యాప్‌ను ప్ర‌వేశపెట్టిన‌ట్లు తెలిపారు. ఇది డిజిట‌ల్ అంత‌రాన్ని త‌గ్గించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌న్నారు. అలాగే రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ సునీల్ ద‌త్ మాట్లాడుతూ దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికీ డిజిట‌ల్ సేవ‌ల‌ను అందించ‌డ‌మే తమ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. జియో 4జి ఫీచ‌ర్ ఫోన్లు ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement