త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounters | రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు.. తొమ్మిదేండ్ల‌లో 17 వేల‌కు పైనే..

Encounters | రోజుకు స‌గ‌టున ఐదు ఎన్‌కౌంట‌ర్లు (Encounters).. 289 మంది నేర‌స్థులు మృతి. మ‌రో 34 వేల‌మందికిపైగా నేరాగాళ్ల అరెస్టు. తొమ్మిదేండ్ల‌లో 17 వేల‌కుపైగా ఎన్‌కౌంట‌ర్లు. ఇదంతా ఎక్క‌డ అనుకుంటున్నారు..

G

National | Published On May 19, 2026, 12.09 pm IST

Encounters | రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు.. తొమ్మిదేండ్ల‌లో 17 వేల‌కు పైనే..
Advertisement

Encounters | త్రినేత్ర‌.న్యూస్‌: రోజుకు స‌గ‌టున ఐదు ఎన్‌కౌంట‌ర్లు (Encounters).. 289 మంది నేర‌స్థులు మృతి. మ‌రో 34 వేల‌మందికిపైగా నేరాగాళ్ల అరెస్టు. తొమ్మిదేండ్ల‌లో 17 వేల‌కుపైగా ఎన్‌కౌంట‌ర్లు. ఇదంతా ఎక్క‌డ అనుకుంటున్నారు.. బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో (Uttar Pradesh). యోగీ ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) ప్ర‌భుత్వం నేరాలపై ఉక్కుపాదం మోపుతున్న‌ది.

2017 మార్చి 19న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. క‌రుడుగ‌ట్టిన నేర‌స్థులకు నెల‌వుగా, హ‌త్య‌లు, లైంగిక‌దాడులు లేకుండా ఒక్క రోజు కూడా గ‌డ‌వ‌ని ఆ రాష్ట్రంలో నేర‌ల‌ను అదుపు చేయ‌డానికి సీఎం చ‌ర్య‌లు చేప‌ట్టారు. క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్థులు ఉంటే జైలులో ఉండాలి, లేదా ఎన్‌కౌంట‌ర్ అవ్వాలి అన్న‌ట్లు పోలీసుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేశారు. దీంతో రోజుకు సగటున ఐదు ఎన్‌కౌంటర్ల చొప్పున గ‌త తొమ్మిదేండ్ల‌లో యూపీ పోలీసులు 17,043 ఎన్‌కౌంట‌ర్లు నిర్వహించారు. ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కు 289 మంది క‌ర‌డు గ‌ట్టిన నేర‌స్తులు మ‌ర‌ణించారు. మ‌రో 11,834 మంది గాయ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా నేర‌ల‌ను అదుపు చేయ‌డానికి 34,253 మందిని అరెస్టు చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఘ‌నాంకాల‌ను విడుద‌ల చేసింది. మ‌రోవైపు ఎన్‌కౌంట‌ర్ల‌లో 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయార‌ని, 1,852 మంది గాయపడ్డారని వెల్ల‌డించింది.

టాప్‌లో మీర‌ట్ జోన్‌

ఎన్‌కౌంట‌ర్ల‌లో ఎక్కువ‌గా అనుమానితులు పోలీసులపై కాల్పులు జరిపి, పారిపోవడానికి ప్రయత్నించినవే ఉన్నాయి. ఈ క్ర‌మంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో గాయ‌ప‌డ్డార‌ని పేర్కొంది. కాగా, ఎన్‌కౌంటర్ మరణాలు అత్యధికంగా మీరట్ జోన్‌లో నమోదయ్యాయి. అక్క‌డ జ‌రిగిన‌ 4,813 ఎన్‌కౌంటర్లలో 97 మంది క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తులు హతమయ్యారు, మ‌రో 3,513 మంది గాయపడ్డారు. వివిధ కేసుల్లో 8,921 మంది అరెస్టు అయ్యారే. ఈ ఆపరేషన్లలో 477 మంది పోలీసులు గాయపడగా, ఇద్దరు పోలీసులు మరణించారని ప్రభుత్వం తెలిపింది.

వారనాసిలో 1200 ఎన్‌కౌంట‌ర్లు..

ఇక ప్ర‌ధాని మోదీ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసి జోన్‌లో 1,292 ఎన్‌కౌంటర్లు జ‌రుగ‌గా 29 మంది నేరస్తులు మ‌ర‌ణించారు. 2,426 మంది నేరస్తులను అరెస్టు చేయ‌గా, 907 మంది గాయపడ్డారు. అలాగే, 104 మంది పోలీసులు కూడా గాయాల‌పాల‌య్యారు. ఆగ్రా జోన్‌లో జ‌రిగిన 2,494 ఎన్‌కౌంటర్లలో 24 మంది మరణార‌ణించారు. ఇక్క‌డ 5,845 మంది నేరస్తులను క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు. మ‌రో 968 మంది గాయపడ్డారు.

అల‌హాబాద్ హైకోర్టు ఆగ్ర‌హం..

ఈ నెల‌ 6, 7 తేదీల్లో రాష్ట్రంలో ఏకంగా 35 ఎన్‌కౌంటర్లు జ‌రిగాయి. వాటిలో ముగ్గురు మరణించగా, 35 మంది గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌లు జ‌రిగిన వారం త‌ర్వాత ఎన్‌కౌంటర్ల సంఖ్యకు సంబంధించిన వివరణాత్మక జాబితాను ప్రభుత్వం విడుదల చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్‌కౌంట‌ర్లు సాధార‌ణ విష‌యంగా మారిపోయాయ‌ని, పై అధికారుల‌ను మెప్పించ‌డానికి లేదా నిందితుల‌కు గుణ‌పాఠం చెప్ప‌డానికి వీటిని జ‌రుపుతున్నార‌ని అల‌హాబాద్ హైకోర్టు ఆక్షేపించింది.

Advertisement
Advertisement