Jeevan Reddy | బీఆర్ఎస్‌లో చేరికతో నూతన అధ్యాయం మొదలు కాబోతున్నది: జీవన్‌రెడ్డి
Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో తన చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతున్నదని సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. కేసీఆర్‌తో తనకున్న అనుబంధం ఈనాటిది కాదని చెప్పారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ పార్టీలో తన చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతున్నదని సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. కేసీఆర్‌తో తనకున్న అనుబంధం ఈనాటిది కాదని చెప్పారు. తాను ప్రజా జీవితంలోకి రాక ముందు నుంచే కేసీఆర్‌తో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తనుకు పరిచయం ఉందన్నారు. 1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంలో తాము కలిసి పనిచేశామని వెల్లడించారు.
తదుపరి కాలంలో రాజకీయంగా భిన్నాభిప్రాయాలతో వేర్వేరు పార్టీల్లో వేదికలు పంచుకున్నామని తెలిపారు. భావాలు ఒక్కటైనప్పటికీ భిన్న వేదికల్లో కొనసాగామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ఉద్యమ రథసారధిగా కేసీఆర్‌కు యావత్ తెలంగాణ అండగా నిలిచిందని చెప్పారు. 2006, 2008లో కేసీఆర్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీశా. రాజకీయ పార్టీ ప్రతినిధిగానే ఆయనపై పోటీచేశానే తప్ప ఆయనపట్ల గానీ, తెలంగాణ పట్ల భిన్నాభిప్రాయాలతో కాదు. జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని కేసీఆర్ కూడా చెబుతుంటారని జీవన్ రెడ్డి అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నారు. మేడిగడ్డను సాకుగా చూపెట్టి కేసీఆర్‌ని దోషిగా నిలబెట్టాలని చూశారని విమర్శించారు. మూడేండ్లు గడిచే సరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి దోషిగా మారుతున్నాడు.. అందుకే గత వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలని చూస్తున్నాడని తెలిపారు. రేపు కరువు వస్తే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీయే దానికి కారణమని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుంది
కేసీఆర్ గారితో నా అనుబంధం ఈనాటిది కాదు.. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాకు పరిచయం
జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని కేసీఆర్ గారు కూడా చెపుతూ ఉంటారు -… https://t.co/61ZxhGcJrM pic.twitter.com/cYEvHB2bZh
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



