School Sealed | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బుర్ఖాతో డ్యాన్స్.. పాఠశాల సీజ్
School Sealed | యూపీ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో (Independence Day) హిందూ విద్యార్థినులతో బుర్ఖాలు ధరింపజేసి డ్యాన్స్ (Burqa Dance) చేయించిన ఘటన వివాదాస్పదమైంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పాఠశాలను సీజ్ (UP School Sealed) చేశారు.
School Sealed | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని గోండా జిల్లాలో (Gonda district) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో (Independence Day) హిందూ విద్యార్థినులతో బుర్ఖాలు ధరింపజేసి డ్యాన్స్ (Burqa Dance) చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి పాఠశాలను సీజ్ చేశారు.
ఔసాని బుజుర్గ్‌లో ఉన్న నాలెడ్జ్ బీమ్ అకాడమీ (Knowledge Beam Academy) అనే ప్రైవేట్ పాఠశాలలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా యాజమాన్యం పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా హిందూ విద్యార్థినులకు బుర్ఖాలు, హిజాబ్‌లు ధరింపజేసి భోజ్‌పురి, బాలీవుడ్ సినిమా పాటలకు డ్యాన్స్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాఠశాల తీరుపై విమర్శలు వచ్చాయి.
క్షమాపణలు చెప్పిన యాజమాన్యం..
స్పందించిన యాజమాన్యం.. కేవలం వినోదం కోసమే ప్రదర్శన చేసినట్లు తెలిపింది. ఎవరి మనో భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని పాఠశాల మేనేజర్ రామ్ సురేష్ మౌర్య తెలిపారు. డ్యాన్స్ చేసిన అమ్మాయిలంతా హిందూ విద్యార్థినులేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఘటనకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
పాఠశాల సీజ్..
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి (BSA) అమిత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) రియాజ్ అహ్మద్ స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు (Recognition) లేదని తేలింది. దీంతో పాఠశాలకు అధికారులు సీల్ వేశారు. స్కూల్ సీజ్ కావడంతో అక్కడ చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా తల్లిదండ్రుల అనుమతితో వారిని సమీపంలోని ఇతర ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Also Read..
నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
ఆగస్టు 18, 2026

Prabhas Fauzi | ఇదేం వెరైటీ – ప్రభాస్ ఫౌజీ పోస్టర్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్
ఆగస్టు 15, 2026

Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు
- ●NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
- ●Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్
- ●Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు
- ●Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
- ●BPCL | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రూ.5వేల కోట్లకు బీపీసీఎల్ డిబెంచర్లు..

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు

NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్

Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు



