Prabhas Fauzi | ఇదేం వెరైటీ – ప్రభాస్ ఫౌజీ పోస్టర్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రభాస్ ఫౌజీ నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్ తల లేకుండా కేవలం బాడీని మాత్రమే చూపిస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌పై సోషల్ మీడియా నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. ఈ వెరైటీ పోస్టర్‌తో ప్రభాస్ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడంటూ ఫన్నీగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Entertainment | Published On Aug 15, 2026, 6.25 pm IST
Prabhas Fauzi | ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రభాస్ ఫౌజీ నుంచి స్పెషల్ అప్‌డేట్ వచ్చేసింది. ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్ ఫౌజీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
చార్మినార్...గాంధీ
స్వాతంత్య్ర దినోత్సవం సదర్భంగా శనివారం ఫౌజీ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్ ముఖం చూపించకుండా కేవలం బాడీని మాత్రమే చూపిస్తూ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో రెండు రివాల్వర్లు పట్టుకొని ప్రభాస్ కనిపిస్తున్నారు. అతడి ఒంటిపై ఉన్న తెల్లటి డ్రెస్ నిండా రక్తం మరకలు ఉన్నాయి. ప్రభాస్ వెనుక గాంధీ వేషధారణలో ఉన్న వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్...మంటల్లో కాలిపోతున్న పురాతన కాలం నాటి ఇళ్లులు కనిపించడం ఆసక్తిని పంచుతోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫనీ కామెంట్స్...
ప్రభాస్ తల లేకుండా పోస్టర్‌ను రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతోన్నారు. హీరో ముఖం కట్ చేసి పోస్టర్‌ను రిలీజ్ చేయడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి అంటూ కామెంట్లు పెడుతోన్నారు. ఫౌజీ పోస్టర్‌తో ప్రభాస్ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడంటూ ఫన్నీగా పోస్ట్‌లు చేస్తున్నారు.
అనుపమ్ ఖేర్...
ఫౌజీ సినిమాలో మహత్మా గాంధీ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించనున్నట్లు సమాచారం. రవీంద్రనాథ్ ఠాగూర్‌గా అనీష్ కురివిల్లా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బ్రిటీషర్లతో పాటు నిజాం సైన్యాన్ని ఎదురించే పోరాడే రహస్య సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చాలా పవర్‌ఫుల్‌గా రెబెల్ స్టార్ రోల్ సాగుతుందని అంటున్నారు.
డిసెంబర్‌లో రిలీజ్
ఫౌజీ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మరోసారి మేకర్స్ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఫౌజీ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | జగ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..
- ●Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్రయత్నాన్ని అభినందించండి.. కేంద్రం సన్న బియ్యానికి ఖర్చు భరిస్తే మోదీ ఫొటో పెడతాం
- ●Y chromosome Disappearing | భవిష్యత్తులో మగవాళ్లు ఉండరా? 'Y క్రోమోజోమ్' మాయమవుతోందా? దాని క్షీణత వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
- ●OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
- ●Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ - సాయం చేసిన అభిమాని

CM Revanth Reddy | జగ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి

Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..

Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్రయత్నాన్ని అభినందించండి.. కేంద్రం సన్న బియ్యానికి ఖర్చు భరిస్తే మోదీ ఫొటో పెడతాం

Y chromosome Disappearing | భవిష్యత్తులో మగవాళ్లు ఉండరా? 'Y క్రోమోజోమ్' మాయమవుతోందా? దాని క్షీణత వెనుక ఉన్న సైన్స్ ఏంటి?






