త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Principal Murdered | ప్రిన్సిప‌ల్ రూపారెడ్డి హ‌త్య కేసులో సంచ‌ల‌న నిజాలు.. 27 సార్లు క‌త్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు

Principal Murdered | నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచ‌ల‌న నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీకి చెందిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.

S

Telangana | Published On Aug 19, 2026, 1.04 pm IST

Principal Murdered | ప్రిన్సిప‌ల్ రూపారెడ్డి హ‌త్య కేసులో సంచ‌ల‌న నిజాలు.. 27 సార్లు క‌త్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు
Advertisement
  • ఇద్ద‌రి అరెస్టు, సాయంత్రంలోగా పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌

Principal Murdered | త్రినేత్ర‌.న్యూస్: నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచ‌ల‌న నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీకి చెందిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. టెన్త్ విద్యార్థులే ఆమెను 27 సార్లు పొడిచి హత్య చేశార‌ని తెలిపారు. గంజాయికి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసమే ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. బుధ‌వారం ఇద్ద‌రు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

ఈ కేసు వివ‌రాలిలా ఉన్నాయి. ఈ నెల 11న రూపారెడ్డి స్కూల్ విధులు ముగిసి ఇంటికి బ‌య‌లుదేరారు. ఆమె ఇంటికి వ‌చ్చే స‌మ‌యానికంటే ముందే నిందితులు గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి ప్ర‌వేశించారు. సుమారు సాయంత్రం 6 గంట‌ల ప్రాంతంలో ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లారు. ఈ సమయంలో నిందితులు వంటగదిలో దాక్కున్నారు. ప్రిన్సిప‌ల్‌ ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే ఊహించ‌ని స్థితిలో వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు అతి దారుణంగా పొడిచారు. ఆమె అపాస్మార‌క స్థితిలోకి వెళ్ల‌గానే హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల రూపాయల‌ను తీసుకొని ప‌రార‌య్యారు. చోరీ చేసిన డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు చేసేందుకు ప‌త‌కం ప‌న్నారు. ఈ హ‌త్య స‌మ‌యంలో నిందితులు ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ దారుణానికి పాల్పడింది పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురని స‌మాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించారు. ముగ్గురిపై అనుమానంతో ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నేడు సాయంత్రం లోగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement