త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భ‌యం.. అందుకే అడ్డుకుంటున్న‌రు

MLA Sudheer Reddy | మేం టిమ్స్ ఆసుపత్రుల వద్దకు వెళ్తే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే భయంతో అడ్డుకుంటున్నారని ఎల్బీన‌గ‌ర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫైరయ్యారు. ఎలాంటి వ‌స‌తులు కల్పించ‌కుండానే స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్‌ను గుడ్డిగా ప్రారంభించార‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Aug 19, 2026, 1.37 pm IST

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భ‌యం.. అందుకే అడ్డుకుంటున్న‌రు
Advertisement
  • ఎలాంటి వ‌స‌తులు లేకుండానే స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్‌ను ప్రారంభించారు
  • ఇంత నీచ‌స్థాయికి దిగ‌జారిన ముఖ్యంత్రి ఎక్క‌డా లేడు
  • ఎల్బీన‌గ‌ర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫైర్‌

త్రినేత్ర‌.న్యూస్: మేం టిమ్స్ ఆసుపత్రుల వద్దకు వెళ్తే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే భయంతో అడ్డుకుంటున్నారని ఎల్బీన‌గ‌ర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫైరయ్యారు. ఎలాంటి వ‌స‌తులు కల్పించ‌కుండానే స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్‌ను గుడ్డిగా ప్రారంభించార‌ని ఆరోపించారు. టిమ్స్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించి, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోకాపేట‌లోని మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఇంటి వ‌ద్ద బుధ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ సహా మేమందరం టిమ్స్ సనత్‌నగర్‌కు వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డుకోవడం సిగ్గుచేటు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసింది. 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒక టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెబుతూ, పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకుండా ప్రచారానికే పరిమితం చేస్తున్నారు

కేసీఆర్ ఆనాడే నిమ్స్‌లో రెండు వేల బెడ్లు చేసిండ్రు. స‌న‌త్‌న‌గ‌ర్‌, అల్వాల్, ఎల్బీన‌గ‌ర్‌లో దాదాపు మూడు వేల బెడ్లు, వరంగ‌ల్‌లో హెల్త్ సిటీకి శంకుస్థాప‌న చేశారు. 10 వేల బెడ్లు రాబోయే త‌రాల‌కు అందాల‌న్న ఉద్దేశంతో మొద‌లు పెట్టారు. బీఆర్ఎస్ హ‌యాంలోనే ఐదారు అంత‌స్తుల రూఫ్‌లు ప‌డ్డ‌య్‌. కానీ గ‌డిచిన మూడు ఏండ్ల‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏం ప‌ని చేయ‌లే. కేసీఆర్ చేసిన‌ట్లు ప్ర‌జ‌లు మ‌రిచిపోవాలే, మేం చేసిన‌ట్లే క‌న‌ప‌డాల‌నే ఒక చెడ్డ ఆలోచ‌న‌తోటి స్లోడౌన్ చేసిండ్రు.

స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్‌ను ముఖ్యమంత్రి గారు నిన్న ప్రారంభించారు. ఒక సూప‌ర్ స్పెషాలిటీని ప్రారంభించే ముందు క‌నీస వ‌స‌తులు ఉన్న‌యా లేదా అని చెక్ చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ ప‌ని చేయకుండా గుడ్డిగా ఓపెన్ చేసింది. అక్క‌డ ఏమాత్రం వ‌స‌తులు లేవ్‌. నాలుగు అంబులెన్స్‌లు పెట్టిండ్రు. గ‌త నాలుగు నెల‌లుగా అక్క‌డ ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు జీతాలు ఇస్త‌లేరని చెప్పి ఇయ్యాళ ధ‌ర్నా కూడా చేస్తా ఉన్న‌రు.

ముందుచూపుతో కేసీఆర్ ఆలోచిస్తే కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం, మేం చేస్తున్నం అని చెప్పుకోవ‌డం కోసం ఆరు నెల్ల‌కొక‌టి ఓపెన్ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్తా ఉన్న‌రు. కేసీఆర్ ఫౌండేష‌న్ వేసి స‌గం ప‌నులు అయ్యాక ఈరోజు నేన్ చేస్తున్నా అని రేవంత్ చెప్పుకోవ‌డం నీచాతినీచమ‌నే చెప్పాలి. రాజ‌కీయాల్లో ఇంత నీచ స్థాయికి దిగ‌జారిండు. ఇటువంటి సీఎంను ఎక్క‌డా చూల్లే అని సుధీరెడ్డి మండిప‌డ్డారు.

Advertisement
Advertisement