త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttar Pradesh | వివాహేత‌ర సంబంధం.. భార్య‌ను కుర్చీకి క‌ట్టేసి స‌జీవ ద‌హ‌నం చేసిన భ‌ర్త‌

Uttar Pradesh | త‌న భార్య మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌నే అనుమానంతో (suspected extramarital affair) ఓ భ‌ర్త‌ ఆమెను కుర్చీకి క‌ట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ (Uttar Pradesh)లో వెలుగు చూసింది.

D

National | Published On Nov 5, 2026, 2.37 pm IST

Uttar Pradesh | వివాహేత‌ర సంబంధం.. భార్య‌ను కుర్చీకి క‌ట్టేసి స‌జీవ ద‌హ‌నం చేసిన భ‌ర్త‌
Advertisement

Uttar Pradesh | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర ప్ర‌దేశ్ (Uttar Pradesh)లో దారుణం వెలుగు చూసింది. త‌న భార్య మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌నే అనుమానంతో (suspected extramarital affair) ఓ భ‌ర్త‌ ఆమెను కుర్చీకి క‌ట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో స‌ద‌రు మ‌హిళ స‌జీవ‌ద‌హ‌న‌మైంది (burned alive). అనంత‌రం నిందితుడు త‌న పిల్ల‌ల్ని తీసుకుని అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క‌న్నౌజ్ (Kannauj) జిల్లా ఛిభ్ర‌మౌ పోలీసు స్టేష‌న్ (Chhibramau police station) ప‌రిధిలోని జ‌గ‌త్‌పూర్ గ్రామంలో (Jagatpur village) గురువారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సుఖ్‌బీర్ సింగ్‌, సోన‌మ్ దంప‌తుల‌కు 11 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు 7 ఏళ్ల బాలుడు, 5 ఏళ్ల బాలిక కూడా ఉన్నారు. సుఖ్‌బీర్ హ‌ర్యానాలోని హిసార్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల క్రిత‌మే గ్రామానికి వ‌చ్చాడు. అయితే, అత‌డు త‌న భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. స్థానిక యువ‌కుడితో ఆమెకు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని అనుమానించేవాడు. దీంతో ఆమెపై నిఘా పెట్టాడు. ఓ రోజు సోన‌మ్ ఆ యువ‌కుడితో ఫోన్‌లో మాట్లాడ‌టాన్ని చూసిన త‌ర్వాత‌ సుఖ్‌బీర్ సింగ్‌కు ఆమెపై అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ విష‌యంపై భార్య‌ను నిల‌దీశాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.

ఈ క్ర‌మంలో ఆగ్ర‌హానికి గురైన సుఖ్‌బీర్ గురువారం ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో త‌న భార్య సోన‌మ్‌ను కుర్చీకి క‌ట్టేసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంత‌రం త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి అక్క‌డి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఇంటికి కూడా నిప్పంటించాడు. ఇంట్లో నుంచి మంట‌లు, అరుపులు రావ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అక్క‌డికి చేరుకొని మంట‌ల‌ను అదుపుచేసే ప్ర‌యత్నం చేశారు. పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాప‌క సిబ్బంది దాదాపు గంట‌న్న‌ర‌పాటూ శ్ర‌మించి మంట‌ల‌ను అదుపు చేశారు. ఇంటి లోప‌లికి వెళ్లి చూడ‌గా.. సోన‌మ్ మృత‌దేహం పూర్తిగా కాలిపోయి ఉంది. ఆమె అస్థిపంజ‌రం మాత్ర‌మే మిగిలి ఉండ‌టాన్ని చూసి స్థానికులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సుఖ్‌బీర్ కోసం గాలింపు చేప‌ట్టారు.

Also Read..

విచార‌ణ పేరుతో అక్ర‌మ నిర్బంధాల‌కు అడ్డుక‌ట్ట.. సుప్రీంకోర్టు చారిత్రాత్మ‌క తీర్పు

విదేశీ నిధులు, పాక్‌తో సంబంధాలు.. సీజేపీ నేత‌ల‌పై కేంద్రం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఢిల్లీలో కూలిన మూడంత‌స్తుల భ‌వ‌నం.. ఇద్ద‌రు మృతి

Advertisement
Advertisement