త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఇదేం ట్విస్ట్‌…800 కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ – రిలీజై నెల‌కాక‌ముందే ఓటీటీలోకి…

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన త‌మిళ సినిమాగా చ‌రిత్ర‌ను సృష్టించింది. 800 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై నెల కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Nov 5, 2026, 1.53 pm IST

OTT | ఇదేం ట్విస్ట్‌…800 కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ – రిలీజై నెల‌కాక‌ముందే ఓటీటీలోకి…
Advertisement

OTT |  ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన జైల‌ర్ 2 భాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఎనిమిది వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. త‌మిళ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. నాలుగు రోజుల్లోనే నాలుగు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఒకే ఒక త‌మిళ సినిమాగా చ‌రిత్ర‌ను సృష్టించింది.

నెల రోజుల్లోనే...

ఇప్ప‌టికీ జైల‌ర్ 2 త‌మిళం, తెలుగు భాష‌ల్లో హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ఆడుతోంది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ర‌జ‌నీకాంత్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. త‌మిళం, తెలుగుతో పాటు మ‌రో మూడు భాష‌ల్లో విడుద‌ల కాబోతుంది.

విమ‌ర్శ‌లు...

థియేట‌ర్ల‌లో ఆడుతోండ‌గానే ఓటీటీలో జైల‌ర్ 2ను రిలీజ్ చేస్తోండ‌టంపై థియేట‌ర్ వ‌ర్గాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేలా అమెజాన్ ప్రైమ్‌తో పాటు నిర్మాణ సంస్థ డీల్ కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం. ఆ ఒప్ప‌దం కార‌ణంగానే త్వ‌ర‌గా జైల‌ర్ 2 ఓటీటీలోకి వ‌స్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నెల్స‌న్ డైరెక్ట‌ర్‌...

జైల‌ర్ 2 మూవీకి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జైల‌ర్‌కు కొన‌సాగింపుగా తెర‌కెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోష‌న్‌, శివ‌రాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌, విజ‌య్ సేతుప‌తి గెస్ట్ రోల్స్ చేశారు. విద్యాబాల‌న్‌, ఎస్‌జే సూర్య‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి విల‌న్లుగా న‌టించారు. ర‌జ‌నీకాంత్ న‌ట‌న‌, ఎలివేష‌న్లు, హీరోయిజంతో పాటు నెల్స‌న్ టేకింగ్‌, గెస్ట్ రోల్స్ జైల‌ర్ 2 విజ‌యంలో కీల‌కంగా నిలిచాయి. జైల‌ర్ 2కు కొన‌సాగింపుగా జైల‌ర్ 3ని కూడా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు హింట్ ఇచ్చారు నెల్స‌న్‌. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

టైగ‌ర్ ముత్తువేల్‌...

విగ్ర‌హాల అక్ర‌మంగా త‌ర‌లించే వ‌ర్మ ముఠాను నాశ‌నం చేసిన‌ జైల‌ర్ ముత్తువేల్ పాండియ‌న్ (ర‌జ‌నీకాంత్‌) కుటుంబంతో మ‌రోచోట‌ అజ్ఞాత జీవితం గ‌డుపుతుంటాడు. వ‌ర్మ స్నేహితుడు దిలీప్‌(సూర‌జ్ వెంజ‌ర‌మూడు)...జైల‌ర్ ఆచూకీ క‌నిపెట్టి అత‌డిని చంపాల‌ని చూస్తుంటాడు. కానీ తెలివిగా జైల‌ర్ దిలీప్ గ్యాంగ్ మొత్తాన్ని లేపేస్తాడు. ఊహించ‌ని విధంగా భోది క‌ల్ప‌క్ (ఎస్‌జే సూర్య‌), కాంత (విద్యా బాల‌న్‌) ద్వారా జైల‌ర్‌కు కొత్త ప్ర‌మాదం వ‌చ్చిప‌డుతుంది. అదేమిటి? వారు వేసిన ఎత్తుల‌ను జైల‌ర్ ఏ విధంగా తిప్పికొట్టాడు? కొడుకు చావుకు వెన‌కున్న నిజాన్ని బ‌య‌ట‌పెట్టి కుటుంబ‌స‌భ్యుల నుంచి జైల‌ర్‌ను బోధి ఎలా దూరం చేశాడు? త‌న స్నేహితులు న‌ర‌సింహ‌(శివ‌రాజ్ కుమార్‌), మాథ్యూ (మోహ‌న్‌లాల్‌) రోడీ (హృతిక్ రోష‌న్‌) సాయంతో క‌ల్ప‌క్ ఫ్యామిలీని జైల‌ర్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement