Kavitha | అయ్యప్ప సోసైటీలో అక్రమ దందాలు.. సీఎం రేవంత్‌పై కవిత సంచలన ఆరోపణలు
Kavitha | హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. నగరంలో రోడ్లు, బస్తీ దవాఖాలు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్రమ సంపాదనపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు.
Kavitha | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. నగరంలో రోడ్లు, బస్తీ దవాఖాలు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్రమ సంపాదనపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. ఎక్కడ చూసినా భూములు, పర్మిషన్లు, టీడీఆర్ పేరుతో అక్రమ దందాలే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యంగా అయ్యప్ప సోసైటీలో (Ayyappa Society) విచ్చలవిడిగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నెల రోజుల్లోగా అయ్యప్ప సోసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే వెళ్లి అక్రమ భవనాలకు రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరించారు.
బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. `భూదాన్ ఉద్యమం స్ఫూర్తితో తెలంగాణ విద్యార్థులకు మంచి చదువు చెప్పించాలని అయ్యప్ప సోసైటీలో 150 ఎకరాలతో గురుకుల ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. ఆ భూముల విషయంలో ట్రస్ట్ ఛైర్మన్ విఠల్ రావు వాటిని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనర్ ఏంచేస్తున్నారు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సోసైటీలోని ఖానామెట్‌లో (Khanmet )5 వందల నుంచి 7 వందల అక్రమ భవనాలు వచ్చాయి. ఇప్పుడు కూడా దాదాపు 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కేవలం నోటరీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తూ.. 10 ఫ్లోర్ల వరకు పర్మిషన్లు ఇస్తున్నారు. రెండు భవనాల మధ్య కనీసం అగర్ బత్తి పట్టేంత స్థలం కూడా లేదు. అక్కడ పెద్ద కాలేజ్‌లు, పీజీ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి భవనంలో సెల్లార్ కిచెన్ ఉంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఇంత జరుగుతున్నా.. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ((Revanth Reddy)) ఏం చేస్తున్నట్లు? ఎందుకు తనిఖీలు చేయడం లేదు? మీ మీద ఎవరి ఒత్తిడి ఉందో చెప్పండి. ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు?.
కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా? రౌడీ రాజ్యమా?
సర్వే నంబర్ 11/ 18 నుంచి 44 వరకు వరుసగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 12లో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విషయాలపై ఏ రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు?. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర్లో ఉన్న ఖానామెట్‌లో అక్రమ బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు ఆపడం లేదు?. ఓ న్యూస్ పేపర్ అక్కడ ఉన్న అక్రమ భవనాలను గూగుల్ మ్యాప్‌తో సహా ట్యాగ్ చేసి న్యూస్ రాసింది. దాన్ని నేను ట్యాగ్ చేసిన తర్వాత ఎంతో మంది మీడియా వాళ్లు ఆ వార్తను కవర్ చేసేందుకు వెళ్లారు. కానీ అక్కడ ఉన్న ఓనర్లు మీడియా వాళ్లను బెదిరిస్తూ భయపెడుతున్నారు. మీడియాను కూడా బెదిరిస్తూ.. మా వెనుక ప్రభుత్వం ఉందని ఆ ఇంటి ఓనర్లు చెబుతున్నారట. అంటే కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా? రౌడీ రాజ్యమా?.
హైకోర్టు ఆర్డర్‌ను కాదని..
మంథని నియోజకవర్గంలో బొగ్గు బాయి రాకముందే, కనీసం సర్వే కూడా కాకముందే శాత్రాజుపల్లి అనే గ్రామంలో అర్థరాత్రి 374 ఇండ్లు కూల్చేశారు. మరి హైదరాబాద్‌లో (Hyderabad) ఇంత అక్రమంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు?. వ్యాపార వేత్తలకు లైన్ క్లియర్ చేస్తూ, పేదల పై ప్రతాపం చూపుతారా?. ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు (High Court) ఆర్డర్‌ను కాదని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరులే దగ్గరుండి పర్మిషన్లు ఇప్పిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ముఖ్యమంత్రే దగ్గరుండి మరి ఈ దందా చేయిస్తున్నారు.
ఇంకా చాలా మంది బిల్డర్లకు సహకరిస్తున్నారు. గల్ఫ్ ఆయిల్ వాళ్లకు కూడా ఇదే విధంగా సహకరిస్తున్నారు. ఆదిత్య బిల్డర్స్ వాళ్లు మూసీ గర్భంలో నిర్మాణాలు చేపడుతుంటే మేము వెళ్లి ధర్నా చేశాం. ఆ తర్వాత మరో మూడు కొత్త ప్రాజెక్ట్ లను మూసీలోనే చేపడుతున్నారు. ఇంత నిసిగ్గుగా ముఖ్యమంత్రి, ఆయన సోదరులు అక్రమ సంపాదనకు తెగబడ్డారు. ఆదిత్య బిల్డర్స్ ఓనర్ ముఖ్యమంత్రి సోదరులకు విల్లా ఇవ్వడంతోనే పర్మిషన్లు ఇచ్చారంట. ఎక్కువ దోపిడీ చేస్తే ప్రకృతి కూడా క్షమించదు.
రాష్ట్రంలో జోక్‌గా ఆర్టీఐ..
రాష్ట్రంలో ఆర్టీఐ (RTI) అనేది జోక్‌గా మారింది. ఎవరు అడిగినా సరే సమాచారం ఇవ్వడం లేదు. ఆర్టీఐ వద్ద 18 వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ అప్లికేషన్లపై ఒత్తిడి పెరగటంతో ఒక్క జిల్లాలోనే 8 వందల అప్లికేషన్లను ఒక్కరోజులో సమాధానం ఇవ్వలేమంటూ చేతులేత్తేశారు. అలాంటప్పుడు ఇక ఆర్టీఐ ఉండి కూడా ఏం లాభం?.
అయ్యప్ప సోసైటీకి సంబంధించి నేను అడిగే దానికి ఆర్టీఐ సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నాం. ఈ లోపు అక్రమ భవనాల విషయంలో చర్యలు తీసుకోవాలి. లేదంటే మా పార్టీ తరఫున వెళ్లి అక్రమ భవనాలకు రెడ్ మార్క్ వేసి వస్తాం. అక్కడ భూములను ప్రజలెవరు కొని ఇబ్బందులు పడవద్దు. అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వ్యాపారులు, నోటరీతో రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. ఖానామెట్ లో సమగ్ర సర్వే నిర్వహించాలి. అనుమతులు లేని భవనాలపై చర్యలు తీసుకోవాలి. ఫైర్ సేప్టీ లేని, అక్రమ అంతస్తులు కడుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలి. నోటరీ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ చేపట్టాలి. అయ్యప్ప సోసైటీ లో నిజమైన యాజమానుల పక్షాన మేము ఉంటాం. వారికి కూడా అన్యాయం చేసే విధంగా ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్నారు` అని కవిత విమర్శించారు.
విదేశీయుల ఓట్లతో గెలిచారా?
`రాష్ట్రానికి అమిత్ షా (Amit Shah) వచ్చి రాజకీయాలు మాట్లాడారు. మన దగ్గర 320 మండలాల్లో కరువు ఉంటే ఆయనేదో సాయం చేస్తారని భావించాం. కానీ కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేసిందని కౌంటర్ గా హైదరాబాద్‌లో ధర్నా చేశారు. రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఒక్క పైసా ఇవ్వలేదు గానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారంట. దేశంలో 13 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని అమిత్ షా చెబుతున్నారు. అంటే గతంలో అదే విదేశీయుల ఓట్లతో గెలిచారా?. ఇలాంటి అబద్దాలు చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తారు` అని ప్రశ్నించారు..
ప్రభుత్వానికే ఇచ్చేస్తా..
నా దగ్గర ఒక్క ఇంచు అసైన్డ్ భూమి, ఇనాం భూమి ఉన్న సరే ప్రభుత్వానికే ఇచ్చేస్తానని కవిత అన్నారు. గోదావరి, కృష్ణా నీళ్లను ఎత్తిపోయకుండా ఇప్పుడు నీళ్లు లేవని ముఖ్యమంత్రి చెబుతున్నాడని మండిపడ్డారు. పంటలు వేయవద్దని (Crop Holiday) సీఎం చెబుతుంటే అలా చెప్పలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారని.. వాళ్ల మధ్యే సయోధ్య లేదన్నారు. వీళ్ల కారణంగా రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత చాలా ఉందని, ఆ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పట్టభద్రుల ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, టీఆర్ఎస్‌కు అండగా ఉండాలని కోరారు. టీఆర్ఎస్ మహిళల కోసం, మహిళల చేత నడిపిస్తున్న పార్టీ అని చెప్పారు.
తాజావార్తలు
- ●Jitendra Singh | విదేశీ నిధులు, పాక్‌తో సంబంధాలు.. సీజేపీ నేతలపై కేంద్రం సంచలన ఆరోపణలు
- ●Market Volatility | మార్కెట్ ఒడిదుడుకులు.. ఈక్విటీ, బంగారం, డెట్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలి?
- ●DSC | 2721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు
- ●Building Collapsed | ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
- ●Tirupati Laddu Adulteration Case | ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయలేం.. తిరుపతి లడ్డూ కల్తీ కేసులో ‘సుప్రీం’ తీర్పు
- ●Karnataka High Court | భర్త జీతం రూ.40 లక్షలు.. అయినా భార్యకు భరణం పొందే హక్కు లేదు : హైకోర్టు

Jitendra Singh | విదేశీ నిధులు, పాక్‌తో సంబంధాలు.. సీజేపీ నేతలపై కేంద్రం సంచలన ఆరోపణలు

Market Volatility | మార్కెట్ ఒడిదుడుకులు.. ఈక్విటీ, బంగారం, డెట్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలి?

DSC | 2721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు

Building Collapsed | ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి






