Building Collapsed | ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Building Collapsed | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాత ఢిల్లీలోని చావ్రి బజార్‌లో గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది (Building Collapsed).
Building Collapsed | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాత ఢిల్లీలోని చావ్రి బజార్‌లో గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది (Building Collapsed). ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.
చావ్రి బజార్ (Chawri Bazaar) మెట్రో స్టేషన్ సమీపంలోని గలి సితార (Gali Sitara) ప్రాంతంలో ఉదయం 9:50 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వాటర్ టెండర్లు, ఆరు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కాగా, ఢిల్లీలో వరుసగా భవనాలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఈశాన్య ఢిల్లీలోని మిలన్ గార్డెన్ ప్రాంతంలోనూ నిర్మాణంలో ఉన్న భవనంలోని రెండు స్లాబులు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో చంద్రపాల్ (60), విజయ్ కుమార్ (33) మరణించారు. పాత ఇంటిపై కొత్త అంతస్తు నిర్మిస్తుండగా పైకప్పులో కొంత భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు అక్టోబర్ 7న ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో చిన్నారి సహా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వంపై ఆప్ ఫైర్
ఇక తాజా ఘటనపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)పై తీవ్రంగా మండిపడ్డారు. సెప్టెంబర్ 6న దక్షిణ ఢిల్లీలోని సత్యానికేతన్‌లో నికేతన్‌లో PG భవనం కూలిపోయిన తర్వాత.. ఎంసీడీ భద్రతా ఆడిట్‌లను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తనిఖీలు జరిగినప్పటికీ భవనాలు ఎందుకు కూలుతున్నాయి..? అంటూ రేఖా గుప్తా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలపై చర్యలు తీసుకోవడంలో వివిధ పౌర, ప్రభుత్వ విభాగాలు సెలెక్టివ్ విధానాన్ని అవలంభిస్తున్నాయని, లంచాల ప్రభావంతోనే ఈ చర్యలు ఉంటున్నాయని ఆరోపించారు. లంచాలు ఇవ్వడానికి నిరాకరించిన భవనాలను మాత్రమే ఎంసీడీ సీజ్ చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Also Read..
భర్త జీతం రూ.40 లక్షలు.. అయినా భార్యకు భరణం పొందే హక్కు లేదు : హైకోర్టు
సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold Price | ధన్‌తేరస్‌కు ముందే బంగారం ధరలకు బ్రేక్.. తులంపై రూ.700 డౌన్.. వెండి రూ.2వేలు..!
నవంబర్ 3, 2026

Gold Rate | దీపావళి వేళ మళ్లీ మెరిసిన బంగారం.. ధరలు ఎంత పెరిగాయంటే..?
నవంబర్ 2, 2026

Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళనపై రాహుల్ గాంధీ కౌంటర్
నవంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Karnataka High Court | భర్త జీతం రూ.40 లక్షలు.. అయినా భార్యకు భరణం పొందే హక్కు లేదు : హైకోర్టు
- ●KTR | 3,300 పైచిలుకు స్టార్టప్‌లకు అండగా టీ హబ్ : కేటీఆర్
- ●Supreme Court | సుప్రీంకోర్ట్‌లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు..
- ●Indian Stock Markets | మదుపర్లపై కనక వర్షం.. 6 రోజుల్లో రూ.28 లక్షల కోట్లు లాభం..
- ●KTR | బడా భాయ్ మోదీ.. చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు!
- ●Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు

Karnataka High Court | భర్త జీతం రూ.40 లక్షలు.. అయినా భార్యకు భరణం పొందే హక్కు లేదు : హైకోర్టు

KTR | 3,300 పైచిలుకు స్టార్టప్‌లకు అండగా టీ హబ్ : కేటీఆర్

Supreme Court | సుప్రీంకోర్ట్‌లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు..

Indian Stock Markets | మదుపర్లపై కనక వర్షం.. 6 రోజుల్లో రూ.28 లక్షల కోట్లు లాభం..



