Ramayana Review | రావణుడి కోణంలో సాగే రామాయణం – నితీష్ తివారీ కథలో ఫిక్షన్ ఎంత?
రామాయణ మూవీపై హైప్‌తో పాటు వివాదాలు భారీగానే వచ్చాయి. రణబీర్‌కపూర్, సాయిపల్లవి పాత్రలపై వచ్చిన విమర్శలు, ప్రమోషన్స్‌లో వారు చేసిన కామెంట్లు, వీఎఫ్ఎక్స్‌పై ట్రోల్స్...ఇలా ఎక్కువగా విమర్శలతోనే వార్తల్లో నిలిచిన రామాయణ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రణబీర్‌కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాలో యశ్ రావణాసురుడిగా నటించారు. ఆధునిక రామాయణం ఎలా ఉందంటే?
Entertainment | Published On Nov 5, 2026, 2.19 pm IST
Ramayana Review | రామాయణం ఆధారంగా తెలుగు, హిందీతో పాటు అనేక భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో ఈ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించారు అంతిమంగా ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన యుద్ధంలో చెడుపై మంచి విజయాన్ని సాధించడమే రామాయణ మూల కథ. ధర్మం తప్పని వీరుడిగా, తండ్రి మాట కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసిన త్యాగమూర్తిగా చాలా సినిమాల్లో రాముడిని చూపించారు దర్శకులు. కానీ రావణుడి కోణం నుంచి రామాయణ కథను చాలా తక్కువ మంది దర్శకులు స్క్రీన్‌పై చూపించారు. అప్పుడెప్పుడో వచ్చిన ఎన్టీఆర్ సీతారామకళ్యాణం తర్వాత చాలా ఏళ్ల అనంతరం నితీష్ తివారీ ఈ తరహా ప్రయోగం చేశారు.రామాయణ...కథ...రాముడిదే...నితీష్ తివారీ రామాయణ మాత్రం రావణుడిది. ఈ సినిమాలో డామినేషన్, స్క్రీన్ ప్రజెన్స్, రన్‌టైమ్ అన్ని రావణుడివే ఎక్కువ.
తెలిసిన కథే...
రామాయణ కథ అందరికి తెలిసిందే. ఆ తెలిసిన కథనే నితీష్ తివారీ ఈ సినిమాలో చూపించారు. అక్కడక్కడ సినిమాటిక్ లిబర్జీ తీసుకున్నారు. అలాగని ఎక్కువ ఫిక్షన్ జోలికి వెళ్లలేదు. అసురులు, దేవతలకు మధ్య జరిగిన యుద్ధంతోనే ఈ సినిమా మొదలైంది. బ్రహ్మ కోసం తపస్సు చేసిన దశానన (యశ్) తనకు మరణం లేకుండా వరం పొంది లంకకు అధిపతి అవుతాడు. దేవలోకాన్ని జయించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. రావణాసుర సంహారం కోసం విష్ణువు...రాముడిగా అవతారం ఎత్తుతాడు. దశరథ మహారాజు పెద్ద కొడుకుగా పుట్టి అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. శివధనస్సు విరిచి సీతను వివాహం అడటం, కైకేయి కారణంగా రాజ్యాన్ని త్యాగం చేసి పధ్నాలుగేళ్లు వనవాసానికి వెళ్లడం.. శూర్పణఖ కారణంగా సీతను రావణాసురుడు అపహరించడం వరకు రామాయణ పార్ట్ వన్ కథను చూపించారు దర్శకుడు.
కత్తి మీద సామే...
రామాయణ గురించి తెలియని ఆడియెన్స్ ఉండరు. తెలిసిన కథతో సినిమా తీసి ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడం అంటే కత్తి మీద సామే. అది అర్థమై నితీష్ తివారీ రావణుడి కథతో ఈ సినిమాను మొదలుపెట్టారు. ఇప్పుడు ఎలాగూ హీరోలను నెగెటివ్ షేడ్స్‌లో చూపించే ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ మైథాలజీ సినిమా విషయంలో దానిని అప్లయ్ చేశాడు. విలన్ అనే కోణంలో కాకుండా అహంకారం, శాపాలు, ఆధర్మం వైపు అడుగులు రావణుడి స్వీయ పతనానికి ఎలా కారణమయ్యాయన్నది చూపించారు. అది కొంత వర్కవుట్ అయ్యింది. సినిమా మొదలైన 30 నుంచి నలభై నిమిషాల తర్వాతే రాముడి పాత్ర తెరపై కనిపిస్తుంది. ఆ తర్వాత సీత...ఇలా పార్ట్ పార్ట్‌లుగా ఒక్కో పాత్రను స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు.
రాక్షసులతో సీతాదేవి పోరాటం... లాంటివి కొన్నివాల్మీకి రామాయణంలో లేని అంశాల విషయంలో కొంత సినిమాటిక్ లిబర్జీ తీసుకున్నారు. అలాంటివి అక్కడక్కడ చాలానే కనిపిస్తాయి. శూర్పణఖ భర్త విద్యాజ్జిహ్వుడితో రావణాసురుడి యుద్దం, లక్షణరేఖ వెనకున్న కథ...రామాయణం ఆధారంగా గతంలో వచ్చిన సినిమాల్లో లేని కొన్ని కొత్త అంశాలను టచ్ చేశారు.
టెక్నికల్‌గా సూపర్...
రామాయణం విషయంలో నితీష్ తివారీ ఎక్కువగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులనే నమ్ముకున్నారు. అదే ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. రావణాసురుడితో జటాయువు యుద్దం, పుష్పకవిమానం ఎపిసోడ్, ఐరావతం సీన్, వనవాసం ఎపిసోడ్స్ భలేగా అనిపిస్తాయి. టెక్నికల్‌గా రామాయణను నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టాయి. జెన్‌సీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. అవే గ్రాఫిక్స్ కొన్ని చోట్ట మైనస్ అయ్యాయి. రెహమాన్, హన్స్ జిమ్మర్ మ్యూజిక్, బీజీఎమ్ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్‌గా మారాయి. రెండు పార్ట్‌ల కోసం కథను సాగే దీసే ప్రయత్నంలో రన్‌టైమ్ కాస్త ఎక్కువే అనిపిస్తుంది.
రావణుడిదే డామినేషన్...
రామాయణలో చాలా మంది యాక్టర్లు కనిపిస్తారు. కానీ యశ్, రణబీర్‌కపూర్ మాత్రమే ఎక్కువగా హైలైట్ అయ్యారు. పార్ట్‌వన్‌లో డామినేషన్ మొత్తం యశ్‌దే. రావణాసురుడి పాత్రలో జీవించాడు. అతడి ఆహార్యం, డైలాగ్ డెలివరీ పాత్రకు తగ్గట్లుగా ఉన్నాయి. రాముడి తగ్గట్లుగా రణబీర్‌కపూర్ రూపం సరిగ్గా సరిపోయింది. హుందాగా ఈ పాత్రలో నటించాడు. సీతగా సాయిపల్లవి నటన ఓకే. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ రెండు, మూడు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. కాజల్ పాత్ర వచ్చి వెళ్లిపోయిన విషయం కూడా తెలియదు. హరీష్ ఉత్తమన్, వివేక్ ఒబెరాయ్, లారాదత్తాతో పాటు మిగిలిన వారు నటన ఆకట్టుకుంటుంది.
రామాయణ జెన్‌జీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హంగుల కోసం చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KAC Trust | విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక పురస్కారం
- ●FII Buying | భారత మార్కెట్లకు పోటెత్తుతున్న విదేశీ పెట్టుబడులు.. అత్యధికంగా కొంటున్న స్టాక్స్ ఇవే..
- ●Niranjan Reddy | డ్రామాగా మారిన రైతు భరోసా.. ఆ మెసేజ్‌లు సర్కారు వైఫల్యానికి నిదర్శనం: నిరంజన్ రెడ్డి
- ●Uttar Pradesh | వివాహేతర సంబంధం.. భార్యను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసిన భర్త
- ●Padmashali Bhavan | కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం.. రూ.5 కోట్లు మంజూరు
- ●Supreme Court | విచారణ పేరుతో అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

KAC Trust | విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక పురస్కారం

FII Buying | భారత మార్కెట్లకు పోటెత్తుతున్న విదేశీ పెట్టుబడులు.. అత్యధికంగా కొంటున్న స్టాక్స్ ఇవే..

Niranjan Reddy | డ్రామాగా మారిన రైతు భరోసా.. ఆ మెసేజ్‌లు సర్కారు వైఫల్యానికి నిదర్శనం: నిరంజన్ రెడ్డి

Uttar Pradesh | వివాహేతర సంబంధం.. భార్యను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసిన భర్త






