Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Regime Change | ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హింసాత్మక మార్గాల ద్వారా ప్రభుత్వ మార్పును (Regime Change) కోరుకునే వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో (government jobs) తలుపులు మూసివేసింది.
Regime Change | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు (government jobs) కొత్త రూల్స్ పెట్టింది. హింసాత్మక మార్గాల ద్వారా ప్రభుత్వ మార్పును (Regime Change) కోరుకునే వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో తలుపులు మూసివేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
యోగి సర్కార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రస్తుత ప్రభుత్వాన్ని లేదా వ్యవస్థను హింసాత్మక మార్గాల ద్వారా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా పరిగణిస్తారు. అభ్యర్థికి 21 ఏళ్లు నిండిన తర్వాత, వెరిఫికేషన్ తేదీకి ముందు మూడేళ్ల వ్యవధిలో ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే, ఆ వ్యక్తి ఇంకా వాటిలో చురుగ్గా ఉన్నట్లు భావించే అవకాశం ఉంది.
అయితే ఈ మధ్య కాలంలో సదరు అభ్యర్థి ప్రవర్తనలో సానుకూల మార్పు వచ్చినట్లు ఆధారాలు ఉంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారు. కేవలం రాజకీయ సిద్ధాంతం ఆధారంగానే ఏ అభ్యర్థిని కూడా అనర్హడిగా పరిగణించరు. కేవలం హింసాత్మక ఘటనల్లో పాల్గొంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది. అభ్యర్థిపై కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన లేదా దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన నేరుగా ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించరని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఇతర తీవ్రమైన నేరాలు..
హత్య, దోపిడీ, అత్యాచారం, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, అవినీతి, ఉగ్రవాద కార్యకలాపాలు, పరీక్షల పేపర్ లీకేజీలు, సాల్వర్ గ్యాంగ్‌లతో సంబంధాలు, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, UPI ఫ్రాడ్‌లు, నకిలీ సర్టిఫికెట్ల వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడే అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
30 రోజుల్లోగా నివేదిక
జిల్లా పోలీస్, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (LIU) అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ నివేదికను 30 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. పోలీసు వెరిఫికేషన్ రిపోర్ట్ రావడం ఆలస్యమైనా అపాయింట్‌మెంట్ లెటర్ ఆపాల్సిన అవసరం లేదు. అభ్యర్థి నుంచి సెల్ఫ్-డిక్లరేషన్ తీసుకుని తాత్కాలిక నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఒకవేళ వెరిఫికేషన్ నెగెటివ్‌గా వస్తే ఉద్యోగం రద్దవుతుంది. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్ తరహాలోనే దేశంలోనూ అరాచకం సృష్టించి ప్రభుత్వాన్ని మార్చాలని (Regime Change) కొందరు కుట్ర పన్నుతున్నారంటూ ఇటీవలే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నూతన పోలీస్ వెరిఫికేషన్ నిబంధనలు అమల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు యోగి సర్కార్ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, కౌన్సిళ్లు, స్థానిక సంస్థల్లో నేరుగా భర్తీ (Direct Recruitment) చేసే ఉద్యోగాలకు వర్తిస్తాయి.
జెన్ జీకి భయపడే..
అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా నిబంధనలు బ్రిటిష్ వలస పాలన (British Raj) నాటి రోజులను గుర్తుచేస్తున్నాయని సమాజ్ వాదీ పార్టీ ప్రతినిషధి ఉదయ్‌వీర్ విమర్శించారు. స్వతంత్ర భారతదేశంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే ప్రభుత్వ మార్పు జరుగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి అంశాల్లో ప్రభుత్వమే న్యాయనిర్ణేతగా వ్యవహరించడం సరి కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. జెన్ జీ నిరసనలకు భయపడే ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు తెచ్చిందని ఆరోపించింది.
Also Read..
లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు
ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?
సంబంధిత వార్తలు

Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?
అక్టోబర్ 26, 2026

Fake Death | హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి.. ఏఐ సహాయంతో చనిపోయినట్లు డ్రామా..
అక్టోబర్ 26, 2026

Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?
- ●Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
- ●Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
- ●ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- ●Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్
- ●Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు

Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?

Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు

Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ

ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..



