త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | విచార‌ణ పేరుతో అక్ర‌మ నిర్బంధాల‌కు అడ్డుక‌ట్ట.. సుప్రీంకోర్టు చారిత్రాత్మ‌క తీర్పు

Supreme Court | అరెస్టు, నిర్బంధంపై (detention and arrest) పోలీసులు చూపే కృత్రిమ వ్యత్యాసాలకు ఎలాంటి రాజ్యాంగ చెల్లుబాటు ఉండదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అదుపులోకి తీసుకున్న వ్య‌క్తిని రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఉద్దేశించిన 24 గంటల గడువు.. అధికారికంగా అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి కాకుండా పోలీసులు నిర్బంధించిన స‌మ‌యం నుంచే ప్రారంభ‌మ‌వుతుంద‌ని తేల్చి చెప్పింది.

D

National | Published On Nov 5, 2026, 2.09 pm IST

Supreme Court | విచార‌ణ పేరుతో అక్ర‌మ నిర్బంధాల‌కు అడ్డుక‌ట్ట.. సుప్రీంకోర్టు చారిత్రాత్మ‌క తీర్పు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 22(2) క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కుల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) చారిత్రాత్మ‌క తీర్పు వెలువ‌రించింది. అరెస్టు, నిర్బంధంపై (detention and arrest) పోలీసులు చూపే కృత్రిమ వ్యత్యాసాలకు ఎలాంటి రాజ్యాంగ చెల్లుబాటు ఉండదని స్పష్టం చేసింది. అదుపులోకి తీసుకున్న వ్య‌క్తిని రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఉద్దేశించిన 24 గంటల గడువు.. అధికారికంగా అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి కాకుండా పోలీసులు నిర్బంధించిన స‌మ‌యం నుంచే ప్రారంభ‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లేందుకు పట్టే ప్రయాణ సమయాన్ని ఈ 24 గంటల నిబంధన నుంచి మినహాయించవచ్చని కోర్టు పేర్కొంది.

నిర్బంధంలో ఉన్న వ్య‌క్తిని 24 గంట‌ల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర‌చాల్సిందేన‌ని న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో (justices Ujjal Bhuyan and AS Chandurkar) కూడిన ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. ఒకవేళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా 24 గంటలకు మించి ఎవరినైనా అదుపులో ఉంచితే.. ఆ నిర్బంధం చట్టవిరుద్ధమ‌ని తేల్చి చెప్పింది. అలాంటి సంద‌ర్భాల్లో ఆ వ్యక్తిని తక్షణమే కస్టడీ నుంచి విడుదల చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఓ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని 2025 సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 గంట‌ల‌ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, అతన్ని మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 30న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు అధికారికంగా అరెస్ట్ చేసిన‌ట్లు చూపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం ఉన్న 24 గంటల గడువు నిబంధనను తప్పించుకునేందుకే దర్యాప్తు సంస్థ ఇలా చేసిందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించ‌గా.. అరెస్ట్ అధికారికంగా నమోదైన సెప్టెంబర్ 30 నుంచే 24 గంటల గడువు మొదలవుతుందని దర్యాప్తు సంస్థ వాదించింది.

ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. అక్ర‌మ నిర్బంధాల‌కు అడ్డుక‌ట్ట వేస్తూ కీల‌క తీర్పు చెప్పింది. అధికారికంగా అరెస్ట్ చూపకపోయినా, వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల గడువు మొదలవుతుందని స్పష్టం చేసింది. విచార‌ణ పేరుతో ఒక వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ, దాన్ని అధికారికంగా అరెస్ట్‌గా చూపకుండా ఒక బఫర్ జోన్‌గా సృష్టించడాన్ని ఆర్టికల్ 22(2) అనుమతించద‌ని స్ప‌ష్టం చేసింది. అలాంటి చర్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమ‌ని ధ‌ర్మాస‌నం తేల్చిచెప్పింది.

కస్టడీ చిత్రహింసలపై కీల‌క‌ వ్యాఖ్యలు

అరెస్టులపై ఉన్న రక్షణలు కస్టడీ చిత్రహింసలను నివారించడానికేనని సుప్రీం ధ‌ర్మాస‌నం నొక్కిచెప్పింది. ఈ సంద‌ర్భంగా కస్టడీ హింసలు, అక్రమ నిర్బంధాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "కస్టడీ హింస మన దేశంలో ఒక దురదృష్టకరమైన వాస్తవం. ఇది న్యాయపరంగానూ గుర్తింపు పొందిన విషయం. దర్యాప్తు సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతుంటాయి. సమాచారం లేదా ఒప్పుకోలు రాబట్టడం కోసం పోలీసులు థ‌ర్డ్‌ డిగ్రీ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అరెస్ట్‌లను నమోదు చేయకుండా ఉండటం ద్వారా లేదా స్వేచ్ఛను హరించడాన్ని కేవలం సుదీర్ఘ విచారణగా వర్ణిస్తూ అరెస్ట్‌లను దాచిపెట్టే పద్ధతులను అనుసరిస్తున్నారు" అని ధ‌ర్మాస‌నం ఆవేదన వ్యక్తం చేసింది. విచార‌ణ స‌మ‌యంలో ఎలాంటి క‌స్ట‌డీ హింస జ‌ర‌గ‌కుండా చూసేందుకు తాము ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నామ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

Also Read..

విదేశీ నిధులు, పాక్‌తో సంబంధాలు.. సీజేపీ నేత‌ల‌పై కేంద్రం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఢిల్లీలో కూలిన మూడంత‌స్తుల భ‌వ‌నం.. ఇద్ద‌రు మృతి

భ‌ర్త జీతం రూ.40 ల‌క్ష‌లు.. అయినా భార్య‌కు భ‌ర‌ణం పొందే హ‌క్కు లేదు : హైకోర్టు

Advertisement
Advertisement