త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gas Cylinder | దీపావ‌ళి కానుక‌.. ఆ ల‌బ్ధిదారుల‌కు ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్‌

Gas Cylinder | ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారుల‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) దీపావ‌ళి కానుక ప్ర‌క‌టించారు. అర్హులైన ల‌బ్ధిదారుల‌కు దీపావ‌ళి పండుగ (Diwali) సంద‌ర్భంగా ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌ను (Gas Cylinder) ఉచితంగా అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందన్నారు.

G

National | Published On Nov 4, 2026, 12.56 pm IST

Gas Cylinder | దీపావ‌ళి కానుక‌.. ఆ ల‌బ్ధిదారుల‌కు ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్‌
Advertisement

Gas Cylinder | త్రినేత్ర న్యూస్‌: ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారుల‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) దీపావ‌ళి కానుక ప్ర‌క‌టించారు. అర్హులైన ల‌బ్ధిదారుల‌కు దీపావ‌ళి పండుగ (Diwali) సంద‌ర్భంగా ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌ను (Gas Cylinder) ఉచితంగా అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందన్నారు. రాష్ట్రంలోని 1.89 కోట్లకు పైగా లబ్ధిదారులకు సిలిండర్ సబ్సిడీ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామ‌న్నారు. దీనికోసం రూ.1,500 కోట్ల నిధులను కేటాయించామ‌ని తెలిపారు. హోలీ (Holi) పండుగ‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించారు. ఉజ్వల పథకం కింద ఉన్న పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగలలో ఒక ఉచిత సిలిండర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని  చెప్పారు. దీని ద్వారా ఆదా చేసే డబ్బుతో దీపావళి మిఠాయిలు, ప్రమిదలు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.

గ‌త కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలో ఒకే ఒక్క గ్యాస్ కనెక్షన్ పొందడానికి ప్రజలు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదని విమ‌ర్శించారు. కానీ తాము పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను (LPG cylinder) అందించామ‌ని, సుపరిపాలన అంటే ఇదేన‌ని చెప్పారు. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 983.45 ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీ అందిస్తుండగా మిగిలిన మొత్తం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించి లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తున్న‌ద‌ని తెలిపారు. పండుగల సందర్భంగా ఉచితంగా అందించే సిలిండర్ వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. గ‌తంలో కూడా యూపీ ప్ర‌భుత్వం దీపావళి కానుకగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఒక వంటగ్యాస్ సిలిండర్ ఉచితంగా అంద‌జేసింది.

ట్యాగ్స్:

DiwaliGas CylinderHoliLPG CylinderPMUYUttar PradeshYogi Adityanath
Advertisement
Advertisement