vivo T5 Lite 44W 5G | భారీ బ్యాటరీ, ఆకట్టుకునే ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
vivo T5 Lite 44W 5G | మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన స్మార్ట్ ఫోన్ టి5 లైట్ 44డబ్ల్యూ 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్, 6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లను ఇచ్చారు. ఈ విభాగంలో అత్యధిక బ్రైట్ నెస్ కలిగిన ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది.
Technology | Published On Jul 16, 2026, 12.52 pm IST
vivo T5 Lite 44W 5G | మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన స్మార్ట్ ఫోన్ టి5 లైట్ 44డబ్ల్యూ 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్, 6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లను ఇచ్చారు. ఈ విభాగంలో అత్యధిక బ్రైట్ నెస్ కలిగిన ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు ముందు వైపు నాచ్ లోపల 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. ర్యామ్‌ను అదనంగా మరో 6జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. దీంతో ఫోన్ వేగంగా, ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. ఈ ఫోన్ బాడీని మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించారు. అందువల్ల బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. అంత సులభంగా పగలదు. ఈ ఫోన్ ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది. అందువల్ల వాటర్, డస్ట్ కు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. అలాగే పలు ఆకట్టుకునే ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు..
ఈ ఫోన్‌లో ఏఐ ద్వారా యూజర్లు చాలా సులభంగా కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. డిజిటల్ డాక్యుమెంట్లను రూపొందించడంతోపాటు వాటిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇందుకు గాను ఏఐ క్రియేషన్ అండ్ డాక్యుమెంట్స్ టూల్ పనిచేస్తుంది. అలాగే ఏఐ క్యాప్షన్స్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ సహాయంతో రియల్ టైమ్‌లో టెక్ట్స్ క్యాప్షన్లను చదవవచ్చు. అవతలి యూజర్లు మాట్లాడే సంభాషణ కూడా రియల్‌టైమ్‌లో అనువాదం అవుతుంది. ప్రైవేట్ స్పేస్ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు తమ సున్నితమైన డేటాను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. దీనికి పూర్తి స్థాయి ప్రైవసీ ఉంటుంది. యూజర్ తప్ప ఇతరులెవరూ ఆ డేటాను యాక్సెస్ చేయలేరని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌లో వెనుక వైపు 50, 0.08 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు ఉండగా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంది. దీనికి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. దీని సహాయంతో ఫోన్‌ను 37 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో దీన్ని లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లతోపాటు మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ను ఇచ్చారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలను అందించారు.
ధర వివరాలు..
వివో టి5 లైట్ 44 డబ్ల్యూ 5జి ఫోన్‌ను ట్వైలైట్ షాడో, వేవ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.19,999 ఉండగా, 6జీబీ, 128జీబీ మోడల్ ధరను రూ.21,999గా నిర్ణయించారు. 6జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.24,999గా ఉంది. ఈ ఫోన్‌ను వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో, ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 22 నుంచి విక్రయించనున్నారు. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.1500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Motorola Edge 70 Max | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్70 మ్యాక్స్
జులై 15, 2026

Smart Phones | స్మార్ట్ ఫోన్లలో దృఢమైన బిల్డ్ క్వాలిటీని కోరుకుంటున్న వినియోగదారులు.. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి..
జులై 13, 2026

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
జులై 10, 2026
తాజావార్తలు
- ●Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
- ●Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!
- ●Taj Banjara | మరో నాలుగు నెలల్లో నేలమట్టం.. చరిత్రలో కలిసిపోనున్న తాజ్ బంజారా..
- ●NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..
- ●Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
- ●Prabhas Fauzi | అఫీషియల్ - ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ - యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ - పోస్టర్ వైరల్

Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!

Taj Banjara | మరో నాలుగు నెలల్లో నేలమట్టం.. చరిత్రలో కలిసిపోనున్న తాజ్ బంజారా..

NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..



