Monsoon session | జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం
Monsoon session | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Monsoon session) జులై 20 నుంచి నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) అధికారికంగా ప్రకటించారు.
Monsoon session | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Monsoon session) జులై 20 నుంచి నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయని తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదం తెలిపారని చెప్పారు. "జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన వాదనలు, చర్చలు, నిర్ణయాల కోసం ఈ సమావేశాలు 2026 జులై 20న ప్రారంభమై, 2026 ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి" అని కిరణ్ రిజుజు స్పష్టం చేశారు.
కాగా, ఈ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర రాజకీయ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాల సందర్భంగా రెండు రాజ్యాంగ సవరణ బిల్లులతోసహా పలు కీలక బిల్లులను ఆమోదింపచేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్న డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill), మహిళల రిజర్వేషన్ బిల్లులను ఈ సెషన్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
దీంతోపాటూ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో ప్రధాని, సీఎం అరెస్టై వరుసగా 30 రోజులకుపైగా జైలులో ఉంటే ఆటోమేటిక్‌గా పదవి రద్దయ్యేలా బిల్లును తీసుకురాబోతున్నది. గతేడాది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల అభ్యంతరాలతో పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జూలై 17న తన నివేదికను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నివేదికను లోక్‌సభకు సమర్పించనున్నారు.
On the recommendation of the Govt of India, Hon’ble President, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Monsoon Session 2026.
The Session will commence on 20 July, 2026 and continue till 13 August, 2026 for meaningful debate,… pic.twitter.com/TaEYH4F1cK— Kiren Rijiju (@KirenRijiju) July 4, 2026
సంబంధిత వార్తలు

Shiv Sena UBT Merger | ఉద్ధవ్ ఠాక్రేకు స్పీకర్ బిగ్ షాక్: ఏక్నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీలు.. టీఎంసీలోనూ చీలిక!
జులై 18, 2026

Monsoon session | పార్లమెంట్ ముందుకు వెళ్లే కీలక బిల్లులు ఇవే.. డీలిమిటేషన్‌కు దక్కని చోటు..!
జులై 17, 2026

Mallikarjun Kharge | డీలిమిటేషన్ బిల్లుపై చర్చిద్దాం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
జులై 16, 2026
తాజావార్తలు
- ●Maha Padayatra | రిజర్వాయర్లు నింపండి.. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్ర.. వీడియో
- ●Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. ఆగస్టు 1 నుంచి పంపిణీ..
- ●Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!
- ●Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?
- ●MBBS | ఎంబీబీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి
- ●Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Maha Padayatra | రిజర్వాయర్లు నింపండి.. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్ర.. వీడియో

Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. ఆగస్టు 1 నుంచి పంపిణీ..

Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!

Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?



