Tummala Nageswara Rao | వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలి: మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao | వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని తొలి కంటింజెన్సీ ప్రణాళిక (Contingency Plan)ను రూపొందించారు.
Tummala Nageswara Rao | త్రినేత్ర.న్యూస్: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఎల్-నినో (El Nino) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని తొలి కంటింజెన్సీ ప్రణాళిక (Contingency Plan)ను రూపొందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధమని చెప్పారు. వాతావరణ అంచనాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించామన్నారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల కోసం చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మండలాల వారీగా, జిల్లాల వారీగా వర్షపాతం లోటు (Rainfall Deficit) వివరాలను అందుబాటులో ఉంచి, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు మార్గదర్శకాలు రూపొందించామని తెలిపారు.
రానున్న రెండు నెలలకు సంబంధించిన వాతావరణ అంచనాలను శాస్త్రీయంగా విశ్లేషించి కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచినట్లు చెప్పారు. భారత వాతావరణ శాఖ (IMD) అందించే వాతావరణ సమాచారాన్ని రోజువారీ, వారంవారీ, నెలవారీగా సంబంధిత శాఖలతో పంచుకొని, వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించనున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు పంటల ఎంపిక, నీటి వినియోగం, వ్యవసాయ నిర్వహణపై శాస్త్రీయ సూచనలు అందించి, పంట నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Electricity Consumption | రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం..
జులై 16, 2026

Pawan Kalyan letter to Revanth Reddy | షాబాద్ ఘోరం పూర్తిగా పోలీసుల వైఫల్యమే : పవన్ కళ్యాణ్
జులై 15, 2026

RS Praveen Kumar vs Nara Lokesh | రేవంత్ చేతులెత్తేశాకే ఆ లొంగుబాటు.. నారా లోకేష్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ రిప్లై!
జులై 15, 2026
తాజావార్తలు
- ●vivo T5 Lite 44W 5G | భారీ బ్యాటరీ, ఆకట్టుకునే ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
- ●Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
- ●Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!
- ●Taj Banjara | మరో నాలుగు నెలల్లో నేలమట్టం.. చరిత్రలో కలిసిపోనున్న తాజ్ బంజారా..
- ●NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..
- ●Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం

vivo T5 Lite 44W 5G | భారీ బ్యాటరీ, ఆకట్టుకునే ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..

Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!

Taj Banjara | మరో నాలుగు నెలల్లో నేలమట్టం.. చరిత్రలో కలిసిపోనున్న తాజ్ బంజారా..



