RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు
RS Praveen Kumar | రేవంత్ కుటుంబ సభ్యులకు ఫ్యూచర్ సిటీలో మూడు వేల ఎకరాలు భూములున్నాయని.. ఆ ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
- ఆ యూనివర్సిటీలేవీ వేరే దేశాల్లో క్యాంపస్‌లు పెట్టవు
- యూకే, యూఎస్‌లలో ఎండాకాలం సెలవులున్నయ్.. అక్కడ వెళ్లి ఎవరిని కలవాలనుకున్నరో మరి?
- ముందు ఉస్మానియా యూనివర్సిటీని బాగు చేయండి.. మిగతావి తర్వాత
- రేవంత్ పర్యటనను ఆపడానికి బలమైన కారణాలున్నయ్..
- అవేంటో రేవంత్, బీజేపీ నేతలు బయటపెట్టాలి
- ఎన్నళ్లేంది ఆయనకు ఆత్మగౌరవం గుర్తొచ్చింది
- మీడియా సమావేశంలో రేవంత్‌పై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫైర్
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: రేవంత్ కుటుంబ సభ్యులకు ఫ్యూచర్ సిటీలో మూడు వేల ఎకరాలు భూములున్నాయని.. ఆ ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆయన పర్యటనను ఆపడానికి బలమైన కారణాలు ఉన్నాయని.. అవేంటో రేవంత్, బీజేపీ నేతలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. యూకే, యూఎస్ యూనివర్సిటీలేవీ వేరే దేశాల్లో క్యాంపస్‌లు పెట్టవని.. అయినా ఇప్పుడు యూకే, యూఎస్‌లలో ఎండాకాలం సెలవులుంటే రేవంత్ ఎవరిని కలుస్తారని ప్రశ్నించారు. తెలంగాణ మణిహారమైన ఉస్మానియా యూనివర్సిటీని ముందు బాగు చేయాలన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వివాదాస్పదం అయింది. నిన్న ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి అసలు విషయం చెప్పకుండా తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టాడు. 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు. సీఎం పత్రికా సమావేశానికి మంత్రులే లేటుగా వస్తున్నారు. రేవంత్ కేబినెట్‌లోనే సయోధ్య లేదు. రేవంత్ పప్పులో కాలు వేశారు. సీఎం మంత్రులకే కాదు బ్యూరోక్రాట్లకు విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ రావాలి. వైట్ పాస్‌పోర్ట్, బ్లూ పాస్‌పోర్టు రెండు ఉంటాయని రేవంత్‌కు తెలియదా?
15 రోజుల ముందే పర్యటన వివరాలు చెప్పాలి..
వైట్ పాస్‌పోర్ట్ అంటే డిప్లమాటిక్ పాస్పోర్ట్. డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించినపుడు అన్ని వివరాలు విదేశాంగ శాఖకు చెప్పాలి. నేను అధికారిగా విదేశాలకు వెళ్లినపుడు కూడా అందరిని కలిసి వివరాలు తెలియజేశా.
15 రోజుల ముందే తన పర్యటన వివరాలు విదేశాంగ శాఖకు తెలియజేయాలి. మన విదేశాంగ విధానానికి అనుగుణంగా నేతల షెడ్యూల్ ఉంటేనే విదేశీ పర్యటనలు ఉంటాయి. వ్యక్తిగత హోదాలో పోతే సమస్యలు ఉండవా?
రేవంత్‌ను ఎవరు గైడ్ చేస్తున్నారో..
కేటీఆర్, హరీష్ రావు విదేశాలకు వెళితే లేని అభ్యంతరాలు తన పర్యటనకు మాత్రం ఎందుకని రేవంత్ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ను ఎవరు గైడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేటీఆర్, హరీష్ రావు సీఎంలు మంత్రులు కారు. వారు వ్యక్తిగత హోదాలో విదేశాలకు వెళితే ఎవరికి అభ్యంతరం ఉంటుంది? కేవలం ఐదు రోజుల ముందే తన పర్యటనపై విదేశాంగ శాఖకు సమాచారమిచ్చారు. నిన్న రేవంత్ రెడ్డి తన టూర్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ డాక్యుమెంట్లతో సహా నిన్న వెల్లడిస్తారని అనుకుంటే అలా చేయలేదు.
రేవంత్ రెడ్డి ఆత్మ ఫ్యూచర్ సిటీ లోనే ఉంది. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు 3 వేల ఎకరాల భూములు ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి. ఆ ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు. వెనుకబడిన వర్గాలు, దళిత గిరిజనులకు మంచి విద్యను అందించేందుకు తాను విదేశీ పర్యటనలకు వెళ్తున్నానని అబద్దాలు చెబుతున్నారు. అయినా ఇప్పుడు యూకే, యూఎస్‌లలో ఎండాకాలం సెలవులు ఉన్నాయి. అక్కడ ప్రొఫెసర్లు అందరూ సెలవుల్లో ఉంటారు. అక్కడకు వెళ్లి ఎవరిని కలుస్తారు? ఎవరిని మభ్య పెట్టడానికి సీఎం ఈ మాటలు మాట్లాడుతున్నారు?
ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు మణిహారం. ఆ యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తానని సీఎం ప్రకటించి ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలి? ముందు ఉస్మానియా యూనివర్సిటీని బాగు చేయండి.. మిగతావి తర్వాత. ప్రభుత్వ డబ్బుతో విదేశాలకు వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో రేవంత్ ఎలా పాల్గొన దలుచుకున్నారు? రేవంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడానికి కోటి రూపాయల ఖర్చు అయింది. దాంతో ఎవరికి లాభం?
రేవంత్ విదేశీ పర్యటనను ఆపడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో రేవంత్, బీజేపీ నేతలు బయట పెట్టాలి. కేటీఆర్ కూడా గతంలో విదేశీ పర్యటనలు చేశారు. అన్ని నిబంధనలు పాటించారు గనుకే ఆయన పర్యటనకు ఎపుడూ అడ్డుకట్ట వేయలేదు. రేవంత్ రెడ్డి చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి. ఇక్కడి యూనివర్సిటీలు బాగు చేసేందుకు విదేశాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఇకనైనా వాస్తవాలు చెప్పాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ హితవు పలికారు.
తెలంగాణ ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తొచ్చిందా?
బీజేపీ, కాంగ్రెస్ నేతలు రేవంత్ విదేశీ పర్యటనపై డ్రామాలు ఆడుతున్నారు. రేవంత్ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకారించడం అనుచితమైన కారణాలు ఏమిటో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చెప్పడం లేదు. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా సీఎంల విదేశీ పర్యటనలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం సీఎంకు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? గోదావరి జలాలు ఏపీకి తరలి వెళ్తుంటే రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది? వివిధ శాఖల్లో ఏపీ అధికారులను రేవంత్ రెడ్డి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టినపుడు తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడినపుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదు. తెలంగాణ తల్లిని మార్చినపుడే రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. రేవంత్ విదేశీ పర్యటనకు తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధం లేదు.
ఆత్మగౌరవం దెబ్బతింటే రాజీనామా చెయ్..
రేవంత్‌కు నిజంగా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనిపిస్తే నైతిక భాద్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది అంటే ఎవరు ఒప్పుకుంటారు? బీజేపీ, జనసేన ఎంపీల కొడుకులు తప్పుడు పనులు చేస్తే రేవంత్ రెడ్డి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవం రేవంత్‌కు ఎక్కడ ఉంది? అని ఆర్ఎస్ ప్రవీణ్ నిలదీశారు.
ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
ఆగస్టు 25, 2026

DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్
ఆగస్టు 25, 2026

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న



