Kiara advani | నయనతార భర్త సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ – కోలీవుడ్ డెబ్యూ ఛాన్స్ మిస్
టాక్సిక్ కంటే ముందు నయనతార, కియారా అద్వానీ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీతోనే కియారా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ కథ నచ్చక ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆ మూవీ ఏందంటే?
Entertainment | Published On Aug 25, 2026, 1.17 pm IST
Kiara advani | యశ్ టాక్సిక్‌లో నయనతారతో పాటు కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ కన్నడ మూవీ ఆగస్ట్ 26న థియేటర్లలోకి రాబోతుంది. పాన్ ఇండియన్ వైడ్‌గా ఈ గ్యాంగ్‌స్టర్ మూవీపై భారీగా హైప్ నెలకొంది. టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలలో టాక్సిక్ మేనియా కనిపిస్తోంది. కాగా టాక్సిక్ కంటే ముందే నయనతార, కియారా అద్వానీ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ కథ నచ్చక కియారా ఆ మూవీని రిజెక్ట్ చేసింది.
విఘ్నేష్ శివన్...
టాక్సిక్ మూవీ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ పాల్గొన్నాడు. టాక్సిక్ తమిళ వెర్షన్‌లో విఘ్నేష్ శివన్ ఓ మూడు పాటలు రాశాడు. ఈ వేడుకలో కియారా అద్వానీపై విఘ్నేష్ శివన్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. "కబీర్ సింగ్ కంటే ముందు కియారాను కలిసి ఓ తమిళ మూవీ కథ చెప్పాను. కానీ అప్పటికీ ఆమెకున్న కమిట్‌మెంట్ల వల్ల ఈ సినిమా చేయలేకపోయింది. కియారాకు చెప్పిన ఆ కథతో ఇటీవల లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చేశా" అంటూ విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. "ఈ సినిమా రిజెక్ట్ చేయడమే కియారాకు మంచిదైంది" అంటూ కామెంట్లు చేశాడు. ఈ కోలీవుడ్ డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతోనే కియారా అద్వానీని తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని విఘ్నేష్ శివన్ భావించారు. కానీ కథ నచ్చక ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. కియారా కాదనడంతో హీరోయిన్‌గా ఆమె ప్లేస్‌లో కృతి శెట్టిని తీసుకొని సినిమా చేశాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ మూవీకి నయనతార ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ యాభై కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. నయనతారకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ – శివాజీ కాంబో రిపీట్
ఆగస్టు 25, 2026

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
ఆగస్టు 24, 2026

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ – బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Supreme Court | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు
- ●DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్
- ●Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..
- ●Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన
- ●Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
- ●Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్

Supreme Court | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్

Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..

Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన



