త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiren Rijiju | మీరు నియ‌మించిన అధికారులే క‌ద‌.. మ‌రి అప్పుడెలా ఓడిపోయారు.. స‌ర్‌, ఎన్నిక‌ల ప్ర‌క్రియపై కాంగ్రెస్‌కు ఐదు ప్ర‌శ్న‌లు సంధించిన కేంద్ర మంత్రి

Kiren Rijiju | స‌ర్‌, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై కాంగ్రెస్ పార్టీ (Congress)కి కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) ఐదు కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు. జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా (CEC Gyanesh Kumar) లేని స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

D

National | Published On Oct 31, 2026, 4.10 pm IST

Kiren Rijiju | మీరు నియ‌మించిన అధికారులే క‌ద‌.. మ‌రి అప్పుడెలా ఓడిపోయారు.. స‌ర్‌, ఎన్నిక‌ల ప్ర‌క్రియపై కాంగ్రెస్‌కు ఐదు ప్ర‌శ్న‌లు సంధించిన కేంద్ర మంత్రి
Advertisement

Kiren Rijiju | త్రినేత్ర న్యూస్ : విదేశీ శక్తులతో చేతులు కలిపి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ కుట్ర పన్నుతోందని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా (CEC Gyanesh Kumar) లేని స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన స‌ర్ ప్ర‌క్రియ‌, ఎన్నిక‌ల విధానాల‌పై స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఐదు కీల‌క‌ ప్ర‌శ్న‌ల‌ను సంధించారు.

కాంగ్రెస్ పార్టీ నియమించిన ఎన్నికల కమిషనర్ల హయాంలోనే 2014 లోక్‌సభ ఎన్నికలు జరిగాయ‌ని, మరి అప్పుడు కాంగ్రెస్ కేవలం 44 స్థానాలకే ఎందుకు పరిమితమైంది..? అంటూ రిజుజు ప్ర‌శ్నించారు. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా లేర‌ని.. మ‌రి అప్పుడెందుకు హ‌స్తం పార్టీ హ్యాట్రిక్ ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది..? అంటూ నిల‌దీశారు. 2014 నుంచి 2026 మధ్య కాలంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి.. దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతారా..? అని ప్ర‌శ్నించారు.

ఓటర్ల జాబితా నుంచి అక్రమ వలసదారులు, మృతి చెందినవారు, వేరే ప్రాంతాలకు వ‌ల‌స వెళ్లిన‌వారిని, నకిలీ ఓటర్ల పేర్లను తొలగించాలా వద్దా..? అంటూ ప్ర‌శ్నించారు. 1952-56, 1958-61, 1965-66, 1983-84, 1987-88, 1993, 1995, 2002-2004 లలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలన్నీ చట్టవిరుద్ధమేనా..? అంటూ నిల‌దీశారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ పార్టీ స‌మాధానాలు చెప్పాల‌ని రిజుజు స‌వాల్ విసిరారు.

Also Read..

ఇండీ కూట‌మి మార్చ్‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌.. ర్యాలీపై ఉత్కంఠ‌

ప్లాస్టిక్ క‌రెన్సీ నోట్లు వ‌చ్చేస్తున్నాయి.. ఎప్పటి నుంచి అంటే.. ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం..?

మెదడుతోనే ప్రపంచాన్ని చూడొచ్చు.. ఎలాన్‌ మస్క్‌ న్యూరాలింక్‌ సంచలనం!

ట్యాగ్స్:

CEC Gyanesh KumarCongressKiren RijijuLok Sabha ElectionsRahul GandhiSIR
Advertisement
Advertisement