INDIA bloc | ఇండీ కూటమి మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరణ.. ర్యాలీపై ఉత్కంఠ
INDIA bloc | నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) అనుమతించారు. అయితే, కన్నాట్ ప్లేస్-మింటో రోడ్డు జంక్షన్ నుంచి రామ్‌లీలా మైదాన్ వరకు చేపట్టాలని నిర్ణయించిన మార్చ్‌కు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు.
INDIA bloc | త్రినేత్ర న్యూస్ : ప్రతిపక్ష ఇండీ కూటమికి ఢిల్లీ పోలీసులు (Delhi Police) షాకిచ్చారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను (SIR) ఉపసంహరించుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతించారు. అయితే, కన్నాట్ ప్లేస్-మింటో రోడ్డు జంక్షన్ నుంచి రామ్‌లీలా మైదాన్ వరకు చేపట్టాలని నిర్ణయించిన మార్చ్ కు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మార్చ్ గురించి తమకు అధికారంగా ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. పోలీసుల ప్రకటనతో భారీ ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది.
అంతకుముందు శుక్రవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆస్క్‌మీ ఎనీ థింగ్ సెషన్ నిర్వహించారు. నవంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్-కన్నాట్ ప్లేస్ నుంచి మార్చ్ ప్రారంభమై రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందని తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా యువతకు పిలుపునిచ్చారు. రాహుల్ ప్రకటన నేపథ్యంలో పోలీసులు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
ర్యాలీని వాయిదా వేసుకోండి
మరోవైపు దీపావళి, ధనత్రయోదశి పండుగల పీక్ సీజన్‌లో ఈ ప్రతిపాదిత ర్యాలీ వల్ల తమ వ్యాపారాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఢిల్లీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ర్యాలీని దీపావళి పండుగ తర్వాతి రోజుకు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియాకు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విడివిడిగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఇండీ కూటమిలోని కీలక నేతలు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ థాక్రే సహా పలువురికి కూడా ఢిల్లీ వ్యాపారులు లేఖ రాశారు. నవంబర్ 10-11 తేదీల తర్వాత ర్యాలీని నిర్వహించుకోవాలని లేఖలో అభ్యర్థించారు.
Also Read..
ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? : సుప్రీంకోర్టు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్
పాఠశాలలో బాలుడి అరాచకం.. చిన్నారిపై పూల కుండీలతో పాశవిక దాడి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ - రామ్‌చరణ్ ఆర్సీ 17లో హీరోయిన్ ఫిక్స్
- ●Supreme Court | ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? : సుప్రీంకోర్టు
- ●Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?
- ●Bollywood | బాలీవుడ్లో విషాదం - ఇంట్లోనే జారిపడి దర్శకుడు కన్నుమూత
- ●Ramchandar Rao | ప్రజాస్వామ్యం నిర్వీర్యమైతుంది.. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: రాంచందర్‌రావు
- ●Haryana | పాఠశాలలో బాలుడి అరాచకం.. చిన్నారిపై పూల కుండీలతో పాశవిక దాడి

Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ - రామ్‌చరణ్ ఆర్సీ 17లో హీరోయిన్ ఫిక్స్

Supreme Court | ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? : సుప్రీంకోర్టు

Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?

Bollywood | బాలీవుడ్లో విషాదం - ఇంట్లోనే జారిపడి దర్శకుడు కన్నుమూత






