YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్‌ఆర్ నిధులు
YIPS | పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS)కు మూడు కార్పొరేట్ సంస్థలు రూ.42.5 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను విరాళంగా అందించాయి.
పోలీసు సిబ్బంది పిల్లల విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థల చేయూత
డీజీపీ సీవీ ఆనంద్‌కు విరాళాల చెక్కులు అందజేత
YIPS | త్రినేత్ర న్యూస్ : పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS)కు మూడు కార్పొరేట్ సంస్థలు రూ.42.5 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను విరాళంగా అందించాయి.
కోహినూర్ గ్రూప్‌కు చెందిన ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షల విరాళాన్ని అందించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్ ఖాద్రీ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ అమ్జద్, ఆయన కుమారుడు మహమ్మద్ నిసార్ ఖాద్రీ ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును డీజీపీ సీవీ ఆనంద్‌కు అందజేశారు.
అలాగే పుజ్జోలానా మెషినరీ ఫ్యాబ్రికేషన్స్ ఎల్‌ఎల్‌పీ, ఆర్యన్ ప్రెసిషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పాయ్ రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. దీవ్యశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక డైరెక్టర్ రవీంద్ర కుమార్ అగర్వాల్ రూ.7.5 లక్షల విరాళాన్ని అందజేశారు.
పోలీసు సిబ్బంది సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ, వారి పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ విరాళాలు అందించినట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు. విద్యాభివృద్ధికి ఉదారంగా సహకరించిన సంస్థల ప్రతినిధులను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. పోలీసు కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అందిన ఈ సీఎస్‌ఆర్ నిధులు పోలీసు సిబ్బంది పిల్లల విద్యాభివృద్ధికి మరింత తోడ్పడనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో
- ●Minister Seethakka | తాగునీటి అవసరాలకు రూ. 120 కోట్లు మంజూరు
- ●INDIA bloc | ఇండీ కూటమి మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరణ.. ర్యాలీపై ఉత్కంఠ
- ●Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ - రామ్‌చరణ్ ఆర్సీ 17లో హీరోయిన్ ఫిక్స్
- ●Supreme Court | ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? : సుప్రీంకోర్టు
- ●Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?

KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో

Minister Seethakka | తాగునీటి అవసరాలకు రూ. 120 కోట్లు మంజూరు

INDIA bloc | ఇండీ కూటమి మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరణ.. ర్యాలీపై ఉత్కంఠ

Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ - రామ్‌చరణ్ ఆర్సీ 17లో హీరోయిన్ ఫిక్స్




