RBI | ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయి.. ఎప్పటి నుంచి అంటే.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం..?
RBI | దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత రూ.10, రూ.20 నోట్లతో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. అయితే కొత్త నోట్ల పరిమాణంలో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రస్తుతం ఉన్న కొలతలనే కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
RBI | దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత రూ.10, రూ.20 నోట్లతో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. అయితే కొత్త నోట్ల పరిమాణంలో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రస్తుతం ఉన్న కొలతలనే కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2027 ఏప్రిల్ 1 నుంచి పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రయోగాత్మక పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. తొలుత రూ.10, రూ.20 నోట్లను కొత్త పాలిమర్ మెటీరియల్‌తో ముద్రించనున్నారు. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల పరిమాణాన్నే కొనసాగించాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లు మనీకంట్రోల్ నివేదిక వెల్లడించింది. దీనివల్ల బ్యాంకులు ఏటీఎంలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త నోట్ల కోసం ఏటీఎంలను తిరిగి సర్దుబాటు చేయడానికి అయ్యే అదనపు ఖర్చును కూడా నివారించవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు.
పాలిమర్ నోట్ల ప్రత్యేకత ఏమిటి?
గత ఆగస్టులో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలిమర్ కరెన్సీ నోట్ల దీర్ఘకాలిక మన్నిక గురించి ప్రస్తావించారు. కొన్ని దేశాల్లో ఈ నోట్లు 30 ఏళ్లకు పైగా ఉపయోగంలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా తరచూ చేతులు మారే తక్కువ విలువ కలిగిన నోట్లకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే వీటిని చలామణిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్‌బీఐకి చెందిన అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్) గత జూలైలో అంతర్జాతీయ తయారీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించింది. భద్రతా లక్షణాలు కలిగిన పాలిమర్ షీట్ల తయారీదారులను గుర్తించడం దీని లక్ష్యం.
రూ.2 వేల కోట్ల నోట్ల ప్రయోగాత్మక పరీక్షలు..
ఈ ప్రయోగం కోసం రూ.10 విలువ కలిగిన 100 కోట్ల నోట్లు, రూ.20 విలువ కలిగిన 100 కోట్ల నోట్లు.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను ప్రతిపాదించారు. వీటి మన్నిక, వినియోగ సౌలభ్యం, ప్రజల ఆమోదం, ఆచరణాత్మక సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైనా ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా తొలగించరు. పాలిమర్ నోట్లు, కాగితపు నోట్లు రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు రూ.1000 పాలిమర్ నోట్లను విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది. కొత్త రూ.1000 నోట్ల జారీపై ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించింది. ప్రస్తుతం అధిక విలువ కలిగిన ఇతర నోట్లలో పాలిమర్ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనలు కూడా లేవు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Neuralink Blindsight | మెదడుతోనే ప్రపంచాన్ని చూడొచ్చు.. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ సంచలనం!
- ●MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప
- ●WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!
- ●Janani Ashok Kumar | తమిళనాడులో 634 కోట్ల స్కామ్ - నటిపై ఆరోపణలు - తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ క్లారిటీ
- ●YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు
- ●KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో

Neuralink Blindsight | మెదడుతోనే ప్రపంచాన్ని చూడొచ్చు.. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ సంచలనం!

MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప

WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!

Janani Ashok Kumar | తమిళనాడులో 634 కోట్ల స్కామ్ - నటిపై ఆరోపణలు - తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ క్లారిటీ






