త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sanjay | అబ‌ద్దాలు చెప్ప‌డంలో నిజంగా నువే గొప్ప

MLA Sanjay | అంద‌రి సీఎంల కంటే తానే గొప్ప అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఊహించుకుంటున్నార‌ని.. ఆయ‌న‌కు అతిశ‌య భ్ర‌మ అనే వ్యాధి ఉంద‌ని కోరుట్ల ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల సంజ‌య్ (MLA Sanjay) విమ‌ర్శించారు.

S

Telangana | Published On Oct 31, 2026, 3.40 pm IST

MLA Sanjay | అబ‌ద్దాలు చెప్ప‌డంలో నిజంగా నువే గొప్ప
Advertisement
  • నీకు నీవే గొప్పోడిన‌ని ఊహించుకుంటున్న‌వ్‌
  • దీన్నే అతిశయ భ్రమ వ్యాధి అంట‌రు
  • రేవంత్‌పై ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వ్యంగ్యాస్త్రాలు

MLA Sanjay | త్రినేత్ర న్యూస్: అంద‌రి సీఎంల కంటే తానే గొప్ప అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఊహించుకుంటున్నార‌ని.. ఆయ‌న‌కు అతిశ‌య భ్ర‌మ అనే వ్యాధి ఉంద‌ని కోరుట్ల ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల సంజ‌య్ (MLA Sanjay) విమ‌ర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ కంటే గొప్ప అని తానే స్వయంగా చెప్పుకుంటున్నారన్నారు. అయితే అబ‌ద్దాలు చెప్ప‌డంలో, త‌న కుటుంబ స‌భ్యుల‌కు భూములు కేటాయించ‌డంలో రేవంత్ నిజంగానే గొప్పోడ‌న్నారు. తెలంగాన భ‌వ‌న్‌లో శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

భూమ్మీదికొచ్చి మాట్లాడు..

రేవంత్ రెడ్డి తనకు తానే గొప్ప వాడినని ఊహించుకుంటున్నారు. అతిశయ భ్రమ అనే వ్యాధితో భాదపడుతున్నారు. రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ తవ్వకాలు చేపట్టి అర్ధాంతరంగా పనులు ఆపేశారు. రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్న జోకర్లతో మాట్లాడించాలి. రేవంత్ హుందాగా ఉండాలి. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మియాపూర్ భూముల కోసం లాయర్లను పెట్టి కొట్లాడారు. ఇప్పుడు జడ్జిమెంట్ రాగానే రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారు అని సంజ‌య్ విమ‌ర్శించారు.

ట్యాగ్స్:

ChandrababuKBR ParkKCRMLA SanjayNtrRevanth ReddyTelanganaYSR
Advertisement
Advertisement