Janani Ashok Kumar | తమిళనాడులో 634 కోట్ల స్కామ్ – నటిపై ఆరోపణలు – తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ క్లారిటీ
634 కోట్ల స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు వస్తోన్న ఆరోపణలపై తమిళ నటి జనని అశోక్‌కుమార్ రియాక్ట్ అయ్యింది. తనపై వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమని చెప్పింది. తనకు డీఎంకే ప్రభుత్వం, మాజీ మంత్రి నెహ్రూతో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
Entertainment | Published On Oct 31, 2026, 3.31 pm IST
డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన 634 కోట్ల స్కామ్‌తో టీవీ నటి జనని ఆశోక్‌కుమార్‌కు సంబంధం ఉన్నట్లుగా కొన్నాళ్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై జనని ఆశోక్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు శనివారం ఓ లేఖను రిలీజ్ చేశారు. ఉద్యోగాల భర్తీ పేరుతో డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ అక్రమాలకు పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ ఆరోపణలు చేసింది. నెహ్రూతో పాటు ఆయన అనుచరుల నివాసాల్లో ఇటీవల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
లంచం...
డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నెహ్రూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి 25 నుంచి 35 లక్షల వరకు లంచం స్వీకరించినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. 634 కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడినట్లు వెల్లడించారు. ఆ డబ్బును పలువురు తమిళ టీవీ, సినిమా ఆర్టిస్టుల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిపారు.
కోలీవుడ్ నటి...
ఈ భారీ స్కామ్‌తో కోలీవుడ్ నటి జనని అశోక్‌కుమార్‌కు సంబంధం ఉన్నట్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై టీవీ నటి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమని చెబుతూ ఓ లేఖను రిలీజ్ చేసింది. ఏ పార్టీతో, నాయకులతో తనకు సంబంధాలు, వ్యక్తిగత పరిచయాలు లేవని అన్నది. నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లను వ్యాప్తి చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేయద్దని కోరింది.
సీరియల్స్... సినిమాలు...
తమిళంలో మాప్పిళ్లై, మౌనరాగం, ఆయుధ ఎళుతు అనే సీరియల్స్‌లో నటించింది. వీరమారి ఆఫీస్, ఇదయం, పోలీస్ పోలీస్‌తో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లలో నటించింది. ఎమాలి, హిట్‌లిస్ట్ అనే సినిమాల్లో నటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
అక్టోబర్ 7, 2026

TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ
సెప్టెంబర్ 27, 2026

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప
- ●WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!
- ●YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు
- ●KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో
- ●Minister Seethakka | తాగునీటి అవసరాలకు రూ. 120 కోట్లు మంజూరు
- ●INDIA bloc | ఇండీ కూటమి మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరణ.. ర్యాలీపై ఉత్కంఠ

MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప

WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!

YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు

KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో



