WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!
WhatsApp | వాట్సాప్‌లో పొరపాటున డిలీట్ చేసిన ముఖ్యమైన చాట్స్‌ను తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ అందుబాటులో ఉండాలి. చివరిసారిగా ఎప్పుడు బ్యాకప్ తీసుకున్నారో పరిశీలించి, కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా పాత సంభాషణలను పునరుద్ధరించుకోవచ్చు.
Technology | Published On Oct 31, 2026, 3.38 pm IST
WhatsApp | వాట్సాప్‌లో పొరపాటున డిలీట్ చేసిన ముఖ్యమైన చాట్స్‌ను తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ అందుబాటులో ఉండాలి. చివరిసారిగా ఎప్పుడు బ్యాకప్ తీసుకున్నారో పరిశీలించి, కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా పాత సంభాషణలను పునరుద్ధరించుకోవచ్చు.
వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం కోట్లాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు పొరపాటున ముఖ్యమైన చాట్స్ డిలీట్ అవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ బ్యాకప్ సదుపాయం ద్వారా తొలగించిన సంభాషణలను తిరిగి పొందవచ్చు. అయితే వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసే ముందు చివరిసారిగా తీసుకున్న బ్యాకప్ తేదీని తప్పనిసరిగా పరిశీలించాలి. మీరు చాట్స్ డిలీట్ చేయడానికి ముందే బ్యాకప్ తీసుకుని ఉంటే వాటిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో చాట్స్ రికవరీ ఎలా చేయాలి..?
ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోని చాట్స్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ చాట్ బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకుని చివరిసారిగా బ్యాకప్ తీసుకున్న తేదీ, సమయాన్ని పరిశీలించాలి. మీరు డిలీట్ చేసిన చాట్స్ ఆ బ్యాకప్‌లో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అనంతరం వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి, ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి. యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయాలి. ఆ తర్వాత కనిపించే రీస్టోర్ చాట్ హిస్టరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. బ్యాకప్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత చాట్ లిస్ట్‌లో తొలగించిన సంభాషణలు తిరిగి వచ్చాయో లేదో పరిశీలించవచ్చు. ఆండ్రాయిడ్‌లో గూగుల్ డ్రైవ్ బ్యాకప్ ద్వారా, ఐఫోన్‌లో ఐక్లౌడ్ బ్యాకప్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది.
బ్యాకప్ లేకపోతే ఏం చేయాలి?
ఎలాంటి బ్యాకప్ అందుబాటులో లేకపోతే శాశ్వతంగా డిలీట్ అయిన చాట్స్‌ను తిరిగి పొందడం కష్టమే. అయితే కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రయత్నించవచ్చు. మీరు మాట్లాడిన అవతలి వ్యక్తి ఫోన్‌లో ఆ సంభాషణ ఇంకా ఉంటే, వారి నుంచి మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. అలాగే వాట్సాప్ లింక్డ్ డివైజ్‌లలో సంబంధిత సందేశాలు అందుబాటులో ఉన్నాయేమో పరిశీలించవచ్చు. కొన్ని నెలల క్రితం డిలీట్ చేసిన చాట్స్‌ను కూడా బ్యాకప్‌లో ఉంటే తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
అయితే పాత బ్యాకప్‌ను రీస్టోర్ చేస్తే, ఆ బ్యాకప్ తీసుకున్న తర్వాత వచ్చిన కొత్త మెసేజ్‌లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ముందు లేటెస్ట్ మెసేజ్‌లను విడిగా బ్యాకప్ తీయాలి. తరువాత పైన తెలిపిన స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి. ఇక ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ చాట్స్ రికవరీ సాధ్యమే కానీ అందుకు పరిమితులు ఉంటాయి. బ్యాకప్ ఉంటేనే చాట్స్ రికవరీ సాధ్యమవుతుంది. బ్యాకప్ లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ఇక చివరి బ్యాకప్ వివరాలు తెలుసుకోవడానికి వాట్సాప్ సెట్టింగ్స్‌లోని చాట్స్ విభాగంలో చాట్ బ్యాకప్ ఆప్షన్‌ను పరిశీలిస్తే సరిపోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప
- ●Janani Ashok Kumar | తమిళనాడులో 634 కోట్ల స్కామ్ - నటిపై ఆరోపణలు - తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ క్లారిటీ
- ●YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు
- ●KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో
- ●Minister Seethakka | తాగునీటి అవసరాలకు రూ. 120 కోట్లు మంజూరు
- ●INDIA bloc | ఇండీ కూటమి మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరణ.. ర్యాలీపై ఉత్కంఠ

MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప

Janani Ashok Kumar | తమిళనాడులో 634 కోట్ల స్కామ్ - నటిపై ఆరోపణలు - తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ క్లారిటీ

YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు

KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో






