KP Vivekananda | మియాపూర్ భూములకు అడ్వాన్స్ తీసుకున్నడేమో
KP Vivekananda | మియాపూర్ భూములు (Miyapur Lands) అమ్మడానికి ముందే అడ్వాన్స్ తీసుకున్నడేమోనని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద (KP Vivekananda) అనుమానం వ్యక్తం చేశారు.
- సుప్రీంకోర్టు తీర్పు కాపీలు రాకముందే అమ్ముతమంటుండు
- అధికారంలోకొచ్చి భూముల అమ్మకాల అక్రమాలన్నీ బయటకు తీస్తం
- సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద ఫైర్
KP Vivekananda | త్రినేత్ర న్యూస్: మియాపూర్ భూముల (Miyapur Lands) పై సుప్రీంకోర్టు తీర్పు కాపీలు రాకముందే సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని.. భూములు అమ్మడానికి ముందే అడ్వాన్స్ తీసుకున్నడేమోనని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద (KP Vivekananda) అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కబ్జాలకు, భూ దందాలకు ఆర్టీఐలకు, బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి పరిపాలన చేస్తానని చెప్పడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ అక్రమాలన్ని బయటకు తీస్తామన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఎడ్డి, గుడ్డి మాటలు మాట్లాడారు. పచ్చి అబద్దాలు చెప్తున్నారు. 1994లో రంగులు వేసుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు మియాపూర్ భూముల గురించి నేనే పోరాటం చేశాను అని అంటున్నారు. రేవంత్ రెడ్డికి భూముల అమ్మకం తప్ప ఏం తెలియదు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సంక్షేమం కోసం పని చేస్తున్నారు. మెట్రో భూములు కాజేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశారు.
హిల్ట్ పాలసీతో భూ దందాకు తెర లేపారు. భూముల అమ్మకాలపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తాం. రేవంత్ రెడ్డి 25 శాతం కమీషన్లు తీసుకుని భూములు అమ్ముతున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం ఈ సన్నాసులు, దద్దమ్మలతో అవుతుందా? రేవంత్ రెడ్డి కబ్జాలకు, భూ దందాలకు ఆర్టీఐలకు, బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అని వివేకానంద ఆరోపణలు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ - రామ్‌చరణ్ ఆర్సీ 17లో హీరోయిన్ ఫిక్స్
- ●Supreme Court | ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? : సుప్రీంకోర్టు
- ●Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?
- ●Bollywood | బాలీవుడ్లో విషాదం - ఇంట్లోనే జారిపడి దర్శకుడు కన్నుమూత
- ●Ramchandar Rao | ప్రజాస్వామ్యం నిర్వీర్యమైతుంది.. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: రాంచందర్‌రావు
- ●Haryana | పాఠశాలలో బాలుడి అరాచకం.. చిన్నారిపై పూల కుండీలతో పాశవిక దాడి

Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ - రామ్‌చరణ్ ఆర్సీ 17లో హీరోయిన్ ఫిక్స్

Supreme Court | ఒక బంధం నుంచి విడిపోయే హక్కు పురుషులకు లేదా..? : సుప్రీంకోర్టు

Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?

Bollywood | బాలీవుడ్లో విషాదం - ఇంట్లోనే జారిపడి దర్శకుడు కన్నుమూత




