Govind Mohan | దేశంలో స్వదేశీ ఉగ్రవాదం దాదాపు అంతమైపోయింది : హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్
Govind Mohan | భారతదేశం (India)లో స్వదేశీ ఉగ్రవాదం (Homegrown terrorism) దాదాపుగా అంతమైపోయిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ స్పష్టం చేశారు.
Govind Mohan | త్రినేత్ర న్యూస్ : భారతదేశం (India)లో స్వదేశీ ఉగ్రవాదం (Homegrown terrorism) దాదాపుగా అంతమైపోయిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాలు మినహా విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం (foreign inspired terrorism) చాలావరకు కంట్రోల్ అయిందని తెలిపారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ట్రైనీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
దేశంలో దశాబ్దాలుగా ఉన్న అంతర్గత భద్రతా పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాద మూలాలను నిర్మూలించడంతో పాటు ఉగ్రవాద చర్యలను దాదాపుగా అణిచివేసినట్లు తెలిపారు. అలాగే దేశాన్ని అతలాకుతలం చేసిన తీవ్రవాద నక్సలిజం (Militant Naxalism) పూర్తిగా ముగిసిపోయిందని చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు కార్యకలాపాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని చెప్పుకొచ్చారు. సాంప్రదాయ భద్రతా ముప్పులు తగ్గినప్పటికీ.. కాబోయే ఐపీఎస్ అధికారులు సరికొత్త అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలపై ప్రత్యకంగా దృష్టి సారించాలని సూచించారు.
Also Read..
బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే
దొడ్ల డెయిరీ పాలు నాసిరకం.. కంపెనీపై ప్రాసిక్యూషన్ ఆర్డర్
ఐఏఎస్ వదిలి 'జననీతి భారత్' పార్టీ పెట్టిన దివ్యా మిట్టల్.. 2027 యూపీ ఎన్నికల్లో పోటీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి
- ●IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..
- ●Ntr | జైలర్ 2 డైరెక్టర్తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ - టైటిల్ ఇదేనా?
- ●CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం
- ●DMK | బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే
- ●KTR | వినయ్! నేనున్నా భయపడకు.. మంచి వైద్యమిప్పిస్తా

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి

IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..

Ntr | జైలర్ 2 డైరెక్టర్తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ - టైటిల్ ఇదేనా?

CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం






