Ntr | జైలర్ 2 డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ – టైటిల్ ఇదేనా?
జైలర్ దర్శకుడు నెల్సన్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లను నిజం చేస్తూ ఎన్టీఆర్, నెల్సన్ సినిమాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాకు రాక్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
Entertainment | Published On Oct 17, 2026, 3.27 pm IST
Ntr | భుజం గాయం కారణంగా మూడు నెలల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే తిరిగి డ్రాగన్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ యాక్షన్ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తికాకముందే త్రివిక్రమ్‌తో గాడ్ ఆఫ్ వార్ సినిమాను లైన్లో పెట్టాడు ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్ సినిమా కూడా కన్ఫామ్ అయ్యింది.
రూమర్లు నిజం చేస్తూ...
ఎన్టీఆర్, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లను నిజం చేస్తూ సినిమాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ అఫీషియల్‌గా కన్ఫామ్ చేశాడు. నెల్సన్‌తో తమ బ్యానర్లో ఓ సినిమా ఉండబోతున్నట్లు ప్రకటించారు.
టైటిల్ ఇదే...
ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించనున్నట్లు చెబుతున్నారు. నెల్సన్ శైలిలోనే డార్క్ యాక్షన్ కామెడీగా ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు రాక్ అనే టైటిల్ పరిశీలిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్‌ను కలిసిన నెల్సన్ కథను వినిపించినట్లు సమాచారం. యాక్షన్, కామెడీ సినిమా చేసి చాలా కాలం కావడంతో యంగ్ టైగర్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పాడని అంటున్నారు.
అనిరుధ్ మ్యూజిక్...
ఎన్టీఆర్, నెల్సన్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించబోతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. డ్రాగన్ షూటింగ్‌ను డిసెంబర్ నెలాఖరులోగా కంప్లీట్ చేసి...ఆ తర్వాత త్రివిక్రమ్‌తో పాటు నెల్సన్ సినిమాలను మొదలుపెట్టాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి
- ●IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..
- ●CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం
- ●DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే
- ●KTR | వినయ్! నేనున్నా భయపడకు.. మంచి వైద్యమిప్పిస్తా
- ●TTD | హనుమంత వాహనంపై కోదండ రామునిగా మలయప్పస్వామి

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి

IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..

CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం

DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే






