త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే

DMK | ఎన్నికల సంఘం (ECI) నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమైందని డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ (M.K. Stalin) ఆరోపించారు. ఈవీఎం విధానంలో ఎన్నిక‌ల‌కు స్వ‌స్తి ప‌లికి బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది. అంతేకాదు, ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌ (CEC Gyanesh Kumar)ను వెంట‌నే ప‌ద‌వి నుంచి తొల‌గించి.. త‌గిన విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

D

National | Published On Oct 17, 2026, 3.18 pm IST

DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే
Advertisement

DMK | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియపై డీఎంకే (DMK) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌ను (CEC Gyanesh Kumar) వెంట‌నే ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేసింది. అంతేకాదు, ఈవీఎం విధానంలో ఎన్నిక‌ల‌కు స్వ‌స్తి ప‌లికి బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని (Restore ballot paper voting in place of EVMs) డిమాండ్ చేసింది.

జ్ఞానేశ్‌ను తొల‌గించాలి

ఇవాళ చెన్నైలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (M.K. Stalin) అధ్య‌క్ష‌త‌న పార్టీ ఎంపీల స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో మొత్తం నాలుగు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ సంద‌ర్భంగా సీఈసీపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కింద ఓటర్ల పేర్లను తొలగించే ప్రక్రియను ఆయన పర్యవేక్షించారని ఆరోపించారు. ఆయ‌న్ని వెంట‌నే ప‌ద‌వి నుంచి తొల‌గించి.. త‌గిన విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

బ్యాలెట్ విధానంలో ఎన్నిక‌లు జ‌ర‌గాలి

ఎన్నికల సంఘం (ECI) నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమైందని స్టాలిన్ ఆరోపించారు. ఈ కార‌ణంగా ఎన్నికలపై ప్రజల్లో నమ్మకం స‌న్న‌గిల్లుతోంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈవీఎంలలో (EVM) నమోదైన ఓట్లకు, వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈవీఎం విధానానికి పూర్తిగా స్వ‌స్తి ప‌లికి బ్యాలెట్ విధానంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతికి వినతిపత్రం

ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని డీఎంకే ఆరోపించింది. స‌ర్ (SIR) ప్ర‌క్రియ‌ను పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రాష్ట్ర‌ప‌తికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాకుండా, ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగానే భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. స‌ర్ అనేది ఓట‌ర్ల హ‌క్కుల‌ను కాల‌రాసేదిగా కాకుండా.. వారి హ‌క్కుల‌ను ర‌క్షించేలా ఉండాల‌ని పేర్కొంది. ఓట్ల తొల‌గింపు, చేర్పుల‌కు త‌గినంత స‌మ‌యం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. కాంగ్రెస్ నిర్వహించిన నిరసనల కంటే ఒక విద్యార్థి సంఘం, సీజేపీ నిర్వహించిన నిరసనలే ఎక్కువ ప్ర‌భావం చూపాయ‌ని గుర్తు చేసింది. "నిర‌స‌న‌ల ప్ర‌భావానికి కాంగ్రెస్ భ‌య‌ప‌డింది. మొదట కేవ‌లం ప్రేక్షక పాత్రకే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత ఆందోళనలు ఉధృతం కావడంతో ఒత్తిడితోనే అందులో పాల్గొనింది. కాంగ్రెస్ పార్టీ ఇతరుల భుజాలపై ఎక్కి స్వారీ చేస్తూ, చివరికి వారికే వెన్నుపోటు పొడుస్తుందనేది ఆ పార్టీ చరిత్ర తెలిసిన వారికి పూర్తిగా తెలుసు. తమిళనాడు, కేరళలో స‌ర్‌పై చర్చించేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు" అని డీఎంకే వ్యాఖ్యానించింది. ఈ సంద‌ర్భంగా విద్యార్థి సంఘాల ఆందోళ‌న‌ల‌కు డీఎంకే త‌న‌ పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

Also Read..

హనుమంత వాహనంపై కోదండ రామునిగా మలయప్పస్వామి

విన‌య్‌! నేనున్నా భ‌య‌ప‌డకు.. మంచి వైద్య‌మిప్పిస్తా

దొడ్ల డెయిరీ పాలు నాసిరకం.. కంపెనీపై ప్రాసిక్యూషన్ ఆర్డర్

Advertisement
Advertisement