Dodla Dairy | దొడ్ల డెయిరీ పాలు నాసిరకం.. కంపెనీపై ప్రాసిక్యూషన్ ఆర్డర్
Dodla Dairy | దొడ్ల డెయిరీ( Dodla Dairy ) తో పాటు ప్రియా గోల్డ్ బిస్కెట్( Priya Gold Biscuit ) తయారీలో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI ) తేల్చింది. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో ఆయా కంపెనీలపై ప్రాసిక్యూషన్ ఆర్డర్‌కు ఆదేశాలిచ్చింది.
Dodla Dairy | త్రినేత్ర న్యూస్ : దొడ్ల డెయిరీ( Dodla Dairy ) తో పాటు ప్రియా గోల్డ్ బిస్కెట్( Priya Gold Biscuit ) తయారీలో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI ) తేల్చింది. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో ఆయా కంపెనీలపై ప్రాసిక్యూషన్ ఆర్డర్‌కు ఆదేశాలిచ్చింది.
దొడ్ల డెయిరీకి చెందిన ఫుల్ క్రీమ్ పాల నమూనాను పరీక్షించగా, కొవ్వు శాతం నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ క్రమంలో ఆ నమూనాను నాణ్యత లేనిదిగా ప్రకటించారు. కంపెనీ అప్పీల్ చేయడంతో నమూనాను రెఫరల్ ఫుడ్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ.. పాల కొవ్వు శాతం కూడా కనీస ప్రమాణాలకు అనుగుణంగా లేదని నిర్ధారించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఈ ఉల్లంఘనలపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించడంతో తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ప్రియాగోల్డ్ బిస్కెట్లలో పశువుల మేత ఊక..
సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో తయారు చేసే ప్రియాగోల్డ్ బిస్కెట్ల తయారీలో పశువుల మేత ఊకను ముడి పదార్థంగా ఉపయోగిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. వినియోగదారుడి ఫిర్యాదు ఆధారంగా కంపెనీ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిస్కెట్లలో ఫైబర్ కోసం పశువుల మేతకు ఉపయోగించే ఊకను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పదార్థం పశువుల ఆహారం కోసం ఉద్దేశించినదని సూచించే గుర్తులు ఉన్న గోనె సంచుల్లో నిల్వ చేసినట్లు కూడా గుర్తించారు.
తాజావార్తలు
- ●Ex-IAS Divya Mittal Political Party | ఐఏఎస్ వదిలి 'జననీతి భారత్' పార్టీ పెట్టిన దివ్యా మిట్టల్.. 2027 యూపీ ఎన్నికల్లో పోటీ
- ●Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు
- ●Starlink | భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్కు స్టార్‌లింక్ సిద్ధం.. రిలయన్స్ కామెంట్లకు మస్క్ రియాక్షన్..
- ●Bathukamma | అబుదాబిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
- ●Keerthy Suresh | బర్త్‌డే రోజు డబుల్ ట్రీట్ ఇచ్చిన కీర్తి సురేష్ - ఒకటి క్లాస్ - మరోటి మాస్
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పద్మాక్షి గుట్టలో మొక్కలు నాటిన ప్రముఖులు

Ex-IAS Divya Mittal Political Party | ఐఏఎస్ వదిలి 'జననీతి భారత్' పార్టీ పెట్టిన దివ్యా మిట్టల్.. 2027 యూపీ ఎన్నికల్లో పోటీ

Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు

Starlink | భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్కు స్టార్‌లింక్ సిద్ధం.. రిలయన్స్ కామెంట్లకు మస్క్ రియాక్షన్..

Bathukamma | అబుదాబిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు





