TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
TGSRTC | నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలను దర్శించుకునే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ప్రత్యేకంగా ‘టెంపుల్స్ దర్శన్ టూర్’ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో నాలుగు రోజులపాటు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి వెల్లడించారు.
TGSRTC | నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలను దర్శించుకునే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ప్రత్యేకంగా ‘టెంపుల్స్ దర్శన్ టూర్’ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో నాలుగు రోజులపాటు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి వెల్లడించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం, సికింద్రాబాద్ బాట మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రెండు మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు
భక్తుల కోసం రాణిగంజ్ డిపో, కాచిగూడ డిపోల నుంచి రెండు ప్రధాన మార్గాల్లో బస్సులను నడపనున్నారు. ఆయా మార్గాల్లోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా ఈ సర్వీసులు ఆలయాలకు చేరుకోనున్నాయి. రూట్-1లో రాణిగంజ్ డిపో నుంచి ఉదయం 6.50, 7.50, 8.50 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. సికింద్రాబాద్ స్టేషన్కు వరుసగా ఉదయం 7, 8, 9 గంటలకు చేరుకుంటాయి. అక్కడి నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, బాట మహంకాళి ఆలయాలను కవర్ చేసేలా ట్రిప్పులను నిర్వహిస్తారు. మొదటి విడతలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఉదయం 7.25 నుంచి 7.30 గంటల వరకు, పెద్దమ్మ తల్లి ఆలయానికి ఉదయం 8 నుంచి 8.15 గంటల వరకు, భాగ్యలక్ష్మి ఆలయానికి ఉదయం 9.05 నుంచి 9.10 గంటల వరకు, బాట మహంకాళి ఆలయానికి ఉదయం 9.50 నుంచి 9.55 గంటల వరకు బస్సులు చేరుకుంటాయి. రెండో విడతలో మధ్యాహ్నం 12.10 నుంచి 12.25 గంటల మధ్య భాగ్యలక్ష్మి ఆలయానికి, మధ్యాహ్నం 1.15 నుంచి 1.20 గంటల మధ్య బాట మహంకాళి ఆలయానికి చేరుకుంటాయి. మూడో విడతలో మధ్యాహ్నం 2.05 గంటల నుంచి బల్కంపేట, పెద్దమ్మ తల్లి ఆలయాల మీదుగా సాయంత్రం 3.45 నుంచి 4 గంటల మధ్య భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుంటాయి. అనంతరం బాట మహంకాళి ఆలయం మీదుగా సికింద్రాబాద్ స్టేషన్కు, అక్కడి నుంచి రాణిగంజ్ డిపోకు చేరుకుంటాయి.

TGRTC
రాణిగంజ్ డిపోకు సాయంత్రం 5.10, 6.10, 7.10 గంటలకు బస్సులు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. రూట్-లో కాచిగూడ డిపో నుంచి ఉదయం 7.20, 8.20, 9.20 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. అఫ్జల్గంజ్ మీదుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, పెద్దమ్మ తల్లి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, బాట మహంకాళి ఆలయాలను సందర్శించేలా ఈ మార్గాన్ని రూపొందించారు. మొదటి విడతలో భాగ్యలక్ష్మి ఆలయానికి ఉదయం 7.40 నుంచి 7.45 గంటల వరకు, పెద్దమ్మ తల్లి ఆలయానికి ఉదయం 8.35 నుంచి 8.40 గంటల వరకు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఉదయం 9.10 నుంచి 9.25 గంటల వరకు, బాట మహంకాళి ఆలయానికి ఉదయం 9.55 నుంచి 10 గంటల వరకు బస్సులు చేరుకుంటాయి. రెండో విడతలో ఉదయం 11.10 నుంచి 11.15 గంటల మధ్య భాగ్యలక్ష్మి ఆలయానికి, మధ్యాహ్నం 12.05 నుంచి 12.10 గంటల మధ్య పెద్దమ్మ తల్లి ఆలయానికి, మధ్యాహ్నం 12.40 నుంచి 12.55 గంటల మధ్య బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి చేరుకుంటాయి. అనంతరం బాట మహంకాళి ఆలయం మీదుగా సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటాయి. మూడో విడతలో మధ్యాహ్నం 2.40 నుంచి 2.45 గంటల మధ్య భాగ్యలక్ష్మి ఆలయానికి, సాయంత్రం 3.35 నుంచి 3.50 గంటల మధ్య పెద్దమ్మ తల్లి ఆలయానికి, సాయంత్రం 4.20 నుంచి 4.25 గంటల మధ్య బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి, సాయంత్రం 4.55 నుంచి 5 గంటల మధ్య బాట మహంకాళి ఆలయానికి బస్సులు చేరుకుంటాయి. అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్, అఫ్జల్గంజ్ మీదుగా కాచిగూడ డిపోకు తిరిగి చేరుకుంటాయి.

TGRTC
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
- ●Hyderabad | వేసవిలో నీటి ఎద్దడి నివారణకు జలమండలి ప్లాన్!
- ●Pranitha Subhash | తల్లయిన తగ్గని గ్లామర్ - బాపు బొమ్మ ప్రణీత లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!

TGSRTC | ప్రయాణికులకు గుడ్న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!

Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?



