ACB Raids | కాంట్రాక్టర్ నుంచి రూ.50వేల డిమాండ్.. డీఈని వలేసి పట్టుకున్న ఏసీబీ..!
ACB Raids | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దవంగర మండలం కన్నాయిగూడెంకు చెందిన కాంట్రాక్టర్ కర్ర అశోక్ రెడ్డి నుంచి తనకు రావాల్సిన బిల్లులు మంజూరు చేయాల్సిందిగా ఈడీ శ్రీకాంత్‌ను కోరాడు.
ACB Raids | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దవంగర మండలం కన్నాయిగూడెంకు చెందిన కాంట్రాక్టర్ కర్ర అశోక్ రెడ్డి నుంచి తనకు రావాల్సిన బిల్లులు మంజూరు చేయాల్సిందిగా ఈడీ శ్రీకాంత్‌ను కోరాడు. అయితే, బిల్లులు మంజూరు చేయాలంటే రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ అధికారులు హనుమకొండ భవానీనగర్‌లోని శ్రీకాంత్ నివాసంలోనే పట్టుకున్నారు. లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
నిర్మాణ పనులకు సంబంధించిన పది డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి తుది కొలతలు, ఎం బుక్‌లో నమోదు, బిల్లుల ప్రాసెసింగ్ చేసేందుకు గతంలో పెండింగ్‌లో పెట్టిన పనులను పూర్తి చేయడానికి ఈడీ రూ.50వేలు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ పనులన్నీ 2022 సెప్టెంబర్ నుంచి నిలిచిపోయాయి. లంచం మొత్తం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం ఈడీని అరెస్ట్ చేసి వరంగల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పనుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
తాజావార్తలు
- ●Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్




