త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI ATM | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. న‌గ‌దు చోరీ

SBI ATM | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో సోమ‌వారం అర్ధ‌రాత్రి దొంగ‌లు చెల‌రేగిపోయారు. తెలంగాణ చౌర‌స్తాలోని ఎస్బీఐ ఏటీఎం సెంట‌ర్‌లో దోపిడీ దొంగ‌లు ప‌డ్డారు. ఏటీఎం మెషీన్‌ను ధ్వంసం చేశారు. అనంత‌రం అందులో ఉన్న న‌గ‌దును ఎత్తుకెళ్లారు.

S

Telangana | Published On May 26, 2026, 1.11 pm IST

SBI ATM | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. న‌గ‌దు చోరీ
Advertisement

SBI ATM | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో సోమ‌వారం అర్ధ‌రాత్రి దొంగ‌లు చెల‌రేగిపోయారు. తెలంగాణ చౌర‌స్తాలోని ఎస్బీఐ ఏటీఎం సెంట‌ర్‌లో దోపిడీ దొంగ‌లు ప‌డ్డారు. ఏటీఎం మెషీన్‌ను ధ్వంసం చేశారు. అనంత‌రం అందులో ఉన్న న‌గ‌దును ఎత్తుకెళ్లారు.

ఏటీఎంను ధ్వంసం చేసే కంటే ముందు.. దొంగ‌లు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల‌ను ధ్వంసం చేశారు. అనంత‌రం ఏటీఎంను ధ్వంసం చేసి న‌గ‌దును అప‌హ‌రించారు. తెల్ల‌వారుజామున అటుగా వ‌చ్చిన స్థానికులు ఏటీఎం ధ్వంసం కావ‌డాన్ని గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు దోపిడీ జ‌రిగిన తీరును ప‌రిశీలించారు. వేలిముద్ర‌ల‌తో పాటు ఇత‌ర ఆధారాల‌ను క్లూస్ టీమ్ సేక‌రించింది. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి దొంగ‌త‌నాలు జ‌రిగాయ‌ని స్థానికులు చెబుతున్నారు.

అయితే ఎంత న‌గ‌దు చోరీకి గురైంద‌నే దానిపై స్ప‌ష్ట‌త రాలేదు. లావాదేవీల‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఎంత న‌గ‌దు ఎత్తుకెళ్లార‌నే దానిపై స్ప‌ష్టత వ‌స్తుంద‌న్నారు.

ఇటీవ‌లే ఇలాంటి ఘ‌ట‌న షాద్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో కూడా చోటు చేసుకుంది. అక్క‌డ కూడా ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి న‌గ‌దును ఎత్తుకెళ్లారు. ఈ ముఠానే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ఈ దోపిడీకి పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. వ‌రుస చోరీల‌పై స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Advertisement
Advertisement