DRDO Scientist Home | డీఆర్‌డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
DRDO Scientist Home | నిత్యం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నివాస సముదాయంలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళా సైంటిస్ట్ ఫ్లాట్ నుంచి రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదు, విదేశీ కరెన్సీని దొంగలు అపహరించుకుపోయారు.
DRDO Scientist Home | నిత్యం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నివాస సముదాయంలో భారీ చోరీ జరిగింది. కాంప్లెక్స్‌లోని ఓ మహిళా సైంటిస్ట్ ఫ్లాట్ నుంచి భారీగా నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు (Gold Jewellery Stolen) అపహరణకు గురయ్యాయి.
సదరు సైంటిస్ట్ తన కూతుర్ని కలవడానికి చండీగఢ్ వెళ్లిన సమయంలో దొంగలు ఈ చోరీకి (Robbery At DRDO Scientists Delhi Home) పాల్పడ్డారు. ఈ నెల 23న ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో సదరు సైంటిస్ట్ అదేరోజు ఢిల్లీకి చేరుకుంది. ఇంటికెళ్లి చూడగా.. లోపలంతా వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. విలువైన వస్తువుల, బంగారం, నగదు మాయమవడాన్ని గమనించింది.
వెంటనే పోలీసులు ఫిర్యాదు చేసింది. రూ.15,000 నగదు, విదేశీ కరెన్సీ (20 పౌండ్లు, 50 దిర్హామ్‌లు), ఒక బంగారు నెక్లెస్ సెట్, ఆరు బంగారు గాజులు, ఏడు బంగారు గొలుసులు, ఐదు ఉంగరాలు, నాలుగు జతల కమ్మలు, ఇద్దరు అమ్మాయిల గాజులు, ముక్కుపుడక చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. వీటితోపాటూ రెండు జతల వెండి పట్టీలు, 20 గ్రాముల వెండి నాణేలతో కూడిన వస్తువులు కూడా పోయాయని తెలిపింది. చోరీకి గురైన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విలువ మొత్తం రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటుందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చోరీ వ్యవహారం రాజధాని నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
తాజావార్తలు
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా

Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..



