త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol Price | మ‌రోసారి పెట్రోల్ మంట‌

Petrol Price | సామాన్యుడిపై ప్ర‌భుత్వ రంగ చ‌మురు సంస్థ‌లు మ‌రోసారి విరుచుకుప‌డ్డాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను ప‌దిరోజుల్లోనే నాలుగోసారి పెంచి స‌గ‌టు మ‌నిషి న‌డ్డివిరిచాయి. ఈ భారీ పెంపు అనంత‌రం హైద‌రాబాద్‌లో పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82కు ధ‌ర‌లు చేరాయి.

S

Telangana | Published On May 25, 2026, 4.42 pm IST

Petrol Price | మ‌రోసారి పెట్రోల్ మంట‌
Advertisement
  • పెట్రోల్‌, డీజిల్‌పై భారీ వ‌డ్డింపు
  • ప‌ది రోజుల్లో నాలుగోసారి
  • మొత్తంగా పెట్రోల్‌పై రూ.7.68, డీజిల్‌పై రూ.7.72 పెంపు
  • రూ.115.69కి చేరిన పెట్రోల్ ధ‌ర‌

Petrol Rates | త్రినేత్ర‌.న్యూస్‌: సామాన్యుడిపై ప్ర‌భుత్వ రంగ చ‌మురు సంస్థ‌లు మ‌రోసారి విరుచుకుప‌డ్డాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను ప‌దిరోజుల్లోనే నాలుగోసారి పెంచి స‌గ‌టు మ‌నిషి న‌డ్డివిరిచాయి. తాజాగా పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచుతూ సోమ‌వారం ఉద‌య‌మే పిడుగులాంటి వార్త‌తో ప్ర‌జ‌ల‌ను మేల్కొలిపాయి. గ‌త ప‌దిరోజుల్లో ఏకంగా పెట్రోల్‌పై రూ.7.68, డీజిల్‌పై రూ.7.72 చొప్పున ధ‌ర‌ల‌ను పెంచాయి. ఈ భారీ పెంపు అనంత‌రం హైద‌రాబాద్‌లో పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82కు ధ‌ర‌లు చేరాయి.

ఒక‌వైపు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు బ్యారెల్ ధ‌ర త‌గ్గుతున్నా.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మాత్రం పెంచ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లి కాలంలో ధ‌ర‌లు పెరిగిన మొద‌టి రోజైన ఈ నెల 15న ముడి చ‌మురు బ్యార‌ల్ ధ‌ర 101 డాల‌ర్లు ఉండ‌గా, ప్ర‌స్తుతం 91 డాల‌ర్లు ఉండ‌డం విశేషం. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉండ‌డం, అమెరికా, ఇరాన్ యుద్ధం ఒప్పందాల ద‌శ‌కు చేర‌డం, హార్ముజ్ జ‌ల‌సంధి తెరుచుకునే స‌మ‌యం రావ‌డం వంటి ప‌రిణామాల‌తో ముడి చ‌మురు ధ‌ర మ‌రింత త‌గ్గ‌నుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తీవ్ర ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు..

ఇటీవ‌ల‌ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ధ‌ర‌ల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ పెంచ‌బోమ‌ని ప్ర‌ధాని, ప‌లువురు కేంద్ర మంత్రులు ప్ర‌క‌టించారు. ఫ‌లితాలు విడుద‌లైన ప‌ది రోజుల అనంత‌రం చ‌మురు సంస్థ‌లు కొర‌డా ఝులిపించ‌డం ప్రారంభించాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఏకంగా సుమారు ఎనిమిది రూపాయ‌లు పెర‌గ‌డంతో ఆ ప్ర‌భావం ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువ‌ల ధ‌ర‌ల‌పై కూడా ప‌డ‌నుంది. దీనిపై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

2014లో రూ.72.43కే లీట‌ర్ పెట్రోల్‌..

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ అధికారం స్వీక‌రించే స‌మ‌యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.72.43, డీజిల్ ధ‌ర రూ. 55.49గా ఉండేది. ప‌న్నెండేళ్ల కాలంలో పెట్రోల్ ధ‌ర రూ.43.26 పెరిగింది. ఇది అప్ప‌టి ధ‌ర‌లో అర‌వై శాతం. డీజిల్ ధ‌ర ఏకంగా రూ.48.33 పెరిగింది. ఇది అప్ప‌టి ధ‌ర‌లో 87 శాతమ‌వ‌డం గ‌మ‌నార్హం.

ట్యాగ్స్:

Advertisement
Advertisement