త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet | కేంద్ర కేబినెట్ స‌మావేశం.. ప‌లు ప్రాజెక్టుల‌కు రూ.12వేల‌కోట్లు కేటాయింపు..!

Union Cabinet | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం కేంద్ర కేబినెట్ స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో తొలిసారిగా ప్ర‌ధాని కొత్త కార్యాల‌యం సేవాతీర్థ్‌లో జ‌రిగింది. చివరి సమావేశం ఫిబ్రవరి 13న సౌత్ బ్లాక్‌లోని పాత ప్రధానమంత్రి కార్యాలయంలో జ‌రిగిన విష‌యం తెలిసిందే.

P

National | Published On Feb 24, 2026, 5.15 pm IST

Union Cabinet | కేంద్ర కేబినెట్ స‌మావేశం.. ప‌లు ప్రాజెక్టుల‌కు రూ.12వేల‌కోట్లు కేటాయింపు..!
Advertisement

Union Cabinet | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం కేంద్ర కేబినెట్ స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో తొలిసారిగా ప్ర‌ధాని కొత్త కార్యాల‌యం సేవాతీర్థ్‌లో జ‌రిగింది. చివరి సమావేశం ఫిబ్రవరి 13న సౌత్ బ్లాక్‌లోని పాత ప్రధానమంత్రి కార్యాలయంలో జ‌రిగిన విష‌యం తెలిసిందే. కేబినెట్ నిర్ణ‌యాల‌ను కేంద్ర‌మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ప్ర‌క‌టించారు. మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేసేందుకు, క‌నెక్టివిటీని పెంచ‌డం స‌హా రూ.12,236 కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. ఈ భారీ పెట్టుబ‌డులు ప్ర‌ధానంగా రైల్వేలు, ప‌ట్ట‌ణ ర‌వాణాపై దృష్టి సారించిన‌ట్లు తెలిపారు.

గోందియా-జ‌బ‌ల్‌పూర్ రైల్వేలైన్ డ‌బ్లింగ్‌కు రూ.5,236 కోట్లు కేటాయించింది. అద‌నంగా రైల్వే నెట్‌వ‌ర్క్‌ను బ‌లోపేతం చేసేందుకు, పున్‌ర‌ఖ్‌-కియుల్ మూడు, నాల్గులైన విస్త‌ర‌ణ‌కు రూ.2,668 కోట్లు, గమ్హారియా-చండిల్ మూడో, నాల్గో లైన్ల‌కు రూ.1,168 కోట్లు కేటాయించింది. విమానయానం, పట్టణ రవాణాను సులభతరం చేయడానికి శ్రీనగర్‌లో రూ.1,667 కోట్ల వ్యయంతో కొత్త ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ నిర్మాణం, అహ్మదాబాద్ మెట్రో 28వ దశ పొడిగింపున‌కు రూ.1,067 కోట్లు కేటాయింపున‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే, ప‌లు విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలను తీసుకుంది. ఇందులో కేర‌ళ రాష్ట్రం పేరును కేర‌ళంగా మార్చాల‌నే ప్ర‌తిపాద‌న‌కు అంగీకారం తెలిపింది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి కొత్త విద్యుత్ రంగ సంస్కరణలను తెచ్చేందుకు ఆమోదించారు. వ్యవసాయ రంగానికి, రైతులకు ఆర్థిక భద్రత క‌ల్పించేందుకు, ముడి జనపనారకు కనీస మద్దతు ధర కోసం రూ.430 కోట్లు కేటాయించింది.

Read Also :

RRTS Corridor | హైస్పీడ్ రైలు, మెట్రో రెండూ ఒకే ట్రాక్‌పై.. మీరట్‌ ప్రయోగం సూపర్ సక్సెస్
శతాబ్దం తర్వాత తెరుచుకోనున్న కోణార్క్‌ సూర్యనారాయణ దేవాలయం ద్వారాలు..!

T20 World Cup 2026 | వుమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌ని ప్ర‌క‌టించిన ఐసీసీ.. జూన్ 14న భార‌త్‌-పాక్ మ్యాచ్‌..!

Advertisement
Advertisement